ETV Bharat / city

'సమగ్ర వ్యవసాయంపై యువ శాస్త్రవేత్తలు శ్రద్ధ చూపాలి' - telangana varthalu

వ్యవసాయరంగం బలోపేతం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులు, కూలీల కొరత, పెరుగుతున్న పెట్టుబడి నేపథ్యంలో... సమగ్ర వ్యవసాయంపై శాస్త్రవేత్తలు శ్రద్ధ చూపాలని వ్యవసాయ పరిశోధన మండలి మార్గనిర్దేశం చేసింది. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ సంస్థలో... వర్చువల్‌గా ఫోకార్స్ శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. సేద్యాన్ని లాభసాటిగా మార్చేందుకు... యువశాస్త్రవేత్తలు పరిశోధనలకు పదునుపెట్టాలని నిపుణులు దిశానిర్దేశం చేశారు.

ఐసీఏఆర్‌- నార్మ్‌లో యువ శాస్త్రవేత్తల వీడ్కోలు సమావేశం

author img

By

Published : Jan 3, 2021, 4:31 AM IST

'సమగ్ర వ్యవసాయంపై యువ శాస్త్రవేత్తలు శ్రద్ధ చూపాలి'

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ - నార్మ్‌లో యువ శాస్త్రవేత్తల వీడ్కోలు సమావేశం విజయవంతంగా ముగిసింది. వర్చువల్‌గా జరిగిన 111వ ఫౌండేషన్ కోర్స్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి... భారత వ్యవసాయ పరిశోధన మండలి పూర్వ డైరెక్టర్ జనరల్ ఆర్​ఎస్​ పరోడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 17 రాష్ట్రాల నుంచి అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్‌లో ఉత్తీర్ణులై... శాస్త్రవేత్తలుగా నియమితులైన తర్వాత... నార్మ్‌లో ఫోకార్స్‌ శిక్షణ పూర్తి చేసిన 37 మంది యువ శాస్త్రవేత్తలకు ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వాతావరణ మార్పులు, కూలీల కొరత, నేలలు, పెట్టుబడులు, పంటల సాగు సరళిపై యువశాస్త్రవేత్తలు చర్చించారు. ఉత్పత్తి, ఉత్పాదతక, యాంత్రీకీకరణ, ఉత్పత్తుల నిల్వ, రవాణా, గోదాములు, మార్కెటింగ్, గిట్టుబాటు ధర వంటి అంశాలపై మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకున్నామని యువశాస్త్రవేత్తలు తెలిపారు.

సాగును లాభసాటిగా మార్చేందుకు...

సాగు లాభసాటిగా ఉండేందుకు ఎలాంటి పరిశోధనలు జరగాలన్న అంశాలపై యువ శాస్త్రవేత్తలు నార్మ్‌లో శిక్షణ తీసుకున్నారు. అక్టోబరు 5న ప్రారంభమైన ఫోకార్స్‌ శిక్షణ... 3 నెలలపాటు సాగింది. దేశవ్యాప్తంగా ఉన్న భారత వ్యవసాయ పరిశోధన మండలి సంస్థల్లో యువ శాస్త్రవేత్తలు విధులు నిర్వర్తించనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు అధిగమించేందుకు కొత్త పద్ధతులు అవలంబించాల్సిన అవసరముందని యువ శాస్త్రవేత్తలు అంటున్నారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతూ సాగును లాభసాటిగా మార్చేందుకు కృషిచేస్తామంటున్నారు

ప్రయోగాత్మక శిక్షణ

సాగులో నష్టభయం తగ్గించే క్రమంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలు, కొత్త వంగడాలు ఎలా అభివృద్ధి చేయాలనే అంశాలపై నార్మ్‌ ప్రయోగాత్మకంగా శిక్షణ ఇచ్చిందని... నార్మ్‌ డైరెక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఐఏఎస్​, ఐపీఎస్​ శిక్షణ తరహాలో..

ఐఏఎస్​, ఐపీఎస్​ శిక్షణ తరహాలోనే వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపికైన కొత్త అభ్యర్థులకు వ్యవసాయ పరిశోధన సర్వీసెస్‌ శిక్షణ అత్యంత కీలకమైంది. ఫోకార్స్ కార్యక్రమంలో విద్య, పరిశోధన, విస్తరణ రంగాల్లో అవసరమైన కొత్త నైపుణ్యాలు అందిస్తున్నామని నార్మ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అగ్రికల్చర్​ యువ శాస్త్రవేత్తలకు సర్టిఫికెట్ల అందజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.