కృత్రిమ మేధ (ఏఐ)- విద్య, ఉద్యోగావకాశాలు అనే అంశంపై ఈనాడు- హైసియా సంయుక్తంగా వెబినార్ నిర్వహించనున్నాయి. ఉదయం 11.00 గంటలకు వెబినార్ జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగార్జనకు ఎంతో ప్రాధాన్యం గల ఈ అంశంపై నిపుణులు తమదైన విశ్లేషణ అందించనున్నారు. ఈ రంగంలో ఏం జరుగుతోంది? కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాలను ఈ వెబినార్‌లో వివరించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హైసియా అధ్యక్షుడు భరణి కుమార్ అరోల్, హ్యూసిస్ వ్యవస్థాపకుడు, సీఈఓ జీఆర్ రెడ్డి, ఐఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్ ఈ వెబినార్‌లో మాట్లాడతారు. ఇన్‌సైడ్‌వ్యూ టెక్నాలజీస్ ఇంక్ బోర్డ్‌మెంబర్ శేషారావు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఇప్పటికే జూమ్‌లో చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. ఆసక్తి కలవారు ఉదయం 11 గంటల నుంచి ఈనాడు.నెట్, ఈటీవీ భారత్ యాప్లోనూ వీక్షించవచ్చు.