ETV Bharat / city

రంగురంగుల మొక్కజొన్నలు.. 17 రకాల మామిళ్లు - maize crop with different colors

నాలుగున్నర ఎకరాల భూమి...అందులో ముప్పై రకాల పండ్ల చెట్లు... పదిహేడు వెరైటీల మామిళ్లు... అయిదు రకాల బెండకాయలు.. ముత్యాల మెరుపుల మొక్కజొన్నలు... టమాటలు, క్యాప్సికం, బొప్పాయి, ఆకుకూరలు, జొన్నలు, కొర్రలు, కందులు, మినుములు... ఈకొద్ది నేలలోనే విరగకాస్తున్న పంటలెన్నో... ఇవన్నీ ఆధునిక రైతు, హైదరాబాదీ రేణురావు పరిశోధనల కష్టానికి కాసిన ఫలాలు.

రంగురంగుల మొక్కజొన్నలు
రంగురంగుల మొక్కజొన్నలు
author img

By

Published : Jun 6, 2020, 12:08 PM IST

ఆధునికులం అనిపించుకున్నా కొంతమందికి మరోసారి పుడమి తల్లి బాట పట్టాలని ఉంటుంది. హలం పట్టి, పొలం దున్నాలనే కోరిక కలుగుతుంది. పట్టెడన్నం పెట్టే రైతు అనిపించుకోవాలనే గర్వం కలుగుతుంది. రేణుదీ అదే మనస్తత్వం. భర్త ఉద్యోగరీత్యా కొన్నాళ్లు దిల్లీలో ఉందామె. అక్కడ టెర్రస్‌ మీద ఏవో కూరగాయలు, ఆకుకూరలు పెంచేది. కొన్నాళ్ల తర్వాత హైదరాబాద్‌ వచ్చింది. ఇక్కడ అపార్ట్‌మెంట్‌లో మొక్కలు పెంచడానికి స్థలం ఉండేది కాదు. ఆ కొరత మొక్కలే కాదు.. వ్యవసాయమూ చేయాలనే తపన పెరిగేలా చేసింది.

రెండు సార్లు విఫలమైనా..

తనలాంటి ఆలోచన, ఆసక్తి ఉన్న అభినవ్‌ కలిశాడు. ఇద్దరూ కలిసి వికారాబాద్‌లో నాలుగున్నర ఎకరాల స్థలం తీసుకున్నారు. సేంద్రియ పద్ధతిలో సేద్యం మొదలుపెట్టారు. ఏడేళ్లలో విదేశాల నుంచి ఎన్నో రకాల విత్తనాలు తీసుకొచ్చి ప్రయోగాల సాగు చేస్తున్నారు. రెండేళ్లుగా గ్లాస్‌ జెమ్‌ అనే దక్షిణామెరికా పంట పండించడానికి ప్రయత్నించారు. రెండు సార్లు విఫలం అయినా ఈసారి విజయం సాధించారు. రంగురంగుల మొక్కజొన్న పొత్తులు అచ్చం ముత్యాల్లాగే ఉండటం విశేషం.

శిక్షణ అందిస్తూ..

ఆరుగాలం చెమటోడిస్తేనే పంట రైతు చేతికి, అందరి కంచాల్లోకి మెతుకులు వస్తాయి. ఈ కష్టం, సాగు విధానం ఎలా ఉంటుందో విద్యార్థులు, కార్పొరేట్‌ ఉద్యోగులకు వివరిస్తున్నారు రేణు. క్షేత్రమంతా తిప్పుతూ ఏ పంట ఎలా పండించాలి? దాని ప్రత్యేకతలేంటో వివరిస్తున్నారు. పురుగు మందులు, రసాయనాలు వినియోగించడం వల్ల కలిగే నష్టాల్ని తెలియజేస్తున్నారు. వందల మందికి ఇలా అవగాహన కల్పించారు. రేణు గ్రాఫిక్‌ డిజైనర్‌ కూడా. సస్టెయినబుల్‌ మెటీరియల్స్‌ మీద పని చేస్తోంది. ‘డెక్‌ ఎడ్జ్‌’ పేరుతో వ్యాపార సంస్థను నిర్వహిస్తోంది. టీషర్ట్‌ వ్యర్థాల నుంచి పెళ్లిపత్రికలు, గిఫ్ట్‌ ప్యాక్‌లు, స్టేషనరీ, బాక్సులు తయారు చేస్తోంది. మురికివాడల్లోని మహిళలకు శిక్షణనిచ్చి వారికి ఇందులో ఉపాధి కల్పిస్తోంది. - అక్కల మనోజ్‌

ఇవీ చూడండి: వర్షం వచ్చింది... వజ్రాల వేట మొదలైంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.