ఈసారి సంక్రాంతి పండుగకు వెళ్లే వారి కోసం ప్రత్యేక విమానాలు సిద్ధమవుతున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి సంక్రాంతికి అదనపు సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్ విమానయాన సంస్థ సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలను ప్రకటించింది. కేవలం గంటలోనే విజయవాడకు చేరుకోవచ్చు. వీటికి సంబంధించిన షెడ్యూల్‌ను స్పైస్ జెట్ విమాన సంస్థ విడుదల చేసింది.
స్పైస్‌జెట్ విమాన సర్వీసుల వివరాలు:
- జనవరి 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతి రోజూ సాయంత్రం 4.30కు హైదరాబాద్‌లో బయల్దేరి.. 5.30గంటల లోపు విజయవాడకు చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి రాత్రి 7.10 గంటలకి హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
- జనవరి 11వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొత్త సర్వీసు అందుబాటులోకి వస్తుంది. మధ్యాహ్నం 3:20 గంటలకు విమానం విజయవాడలో బయలుదేరి 4:10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
- జనవరి 16 నుంచి 30వ తేదీ వరకు మరో సర్వీసు విజయవాడలో ప్రారంభం అవుతుంది. ఈ విమానం ప్రతి రోజు మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి 3.55కు హైదరాబాద్‌కు వెళుతుంది.
ఇదీ చూడండి: వెలుగులోకి వచ్చిన ఖమ్మం తోగు కోట