ETV Bharat / city

హైదరాబాద్​ నుంచి లండన్​కు​ విమాన సర్వీసులు ప్రారంభం - airways updates

హైదరాబాద్​ నుంచి లండన్​కు విమాన సర్వీసులను అధికారులు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి లండన్‌లోని హీత్రో విమానాశ్రయానికి బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన (బీఏ 276) బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ బయలుదేరి వెళ్లింది. ఈ సర్వీసులు ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాలలో ఉంటాయని అధికారులు తెలిపారు.

hyderabad to landon flight started from today

author img

By

Published : Aug 18, 2020, 4:47 PM IST

ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందం ప్రకారం నిన్నటి నుంచి భారత్- యూకే మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి లండన్‌లోని హీత్రో విమానాశ్రయానికి ఉదయం సుమారు 7.50 గంటలకు బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన (బీఏ 276) బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ బయలుదేరింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కోలుకుంటున్న పౌర విమాన రంగానికి ఈ చర్య ఊతం ఇస్తుంది.

టెర్మినల్‌లోనికి ప్రవేశించడానికి ముందే ప్రయాణికులందరికీ తప్పనిసరిగా నిర్వహించే థర్మల్ స్క్రీనింగ్, సామాజిక దూరం నిబంధనలు సహా అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరిచారు. హైదరాబాద్ నుంచి బ్రిటిష్ ఎయిర్​వేస్ ప్రతి వారం నాలుగు సర్వీసులను నిర్వహిస్తుంది. ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాలలో ఉంటాయని తెలిపారు. భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి లండన్‌కు టికెట్టును బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

ఈ చర్యలతో ప్రయాణికులు ఇరు ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ వారిని కలసుకునేందుకు వెసుబాటు కలిగించినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.