జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో అవినాష్ గ్రూప్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ బషీర్‌బాగ్ నుంచి ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో నినాదాలు చేశారు. నానాటికి పెరుగుతున్న కాలుష్యంపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యావరణ కాలుష్యం మానవ మనుగడకు ప్రమాదకరమని.. ప్రతి ఒక్కరికి కాలుష్యం పట్ల అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కల్ని పరిరక్షిస్తే భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించిన వారమవుతామని పేర్కొన్నారు.
ఇదీచూడండి: Shilpa Chowdary custody: విచారణలో విలపించిన శిల్ప చౌదరి.. 6 గంటల పాటు ప్రశ్నల వర్షం..