ETV Bharat / city

డిజిటల్ చెల్లింపుల్లో హైదరాబాద్ 2వ స్థానం - హైదరాబాద్

దేశంలో ఆన్​లైన్​ ద్వారా నగదు బదిలీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రజోర్​పే అనే సంస్థ చేపట్టిన సర్వేలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రాలవారిగా చూస్తే తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నట్లు సర్వేలో తేలింది.

డిజిటల్ చెల్లింపుల్లో హైదరాబాద్ 2వ స్థానం
author img

By

Published : Oct 16, 2019, 9:26 PM IST

దేశంలో అత్యధికంగా డిజిటల్ చెల్లింపులు చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రజోర్​పే అనే సంస్థ తమ ప్లాట్​ఫామ్​లో జరిగిన నగదు బదిలీల ఆధారంగా ‘'ద ఏరా ఆఫ్ రైజింగ్ ఫిన్​టెక్'’ పేరిట నివేదికను విడుదల చేసింది. మొదటి స్థానంలో దిల్లీ ఉండగా... 3,4వ స్థానాల్లో ముంబయి, పుణె ఉన్నాయి.

స్థానం నగరాలు
1 దిల్లీ
2 హైదరాబాద్
3 ముంబయి
4 పుణె

58 శాతం పెరిగిన యూపీఐ నగదు బదిలీలు..

హైదరాబాద్​లో ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చినట్లయితే యూపీఐ బదిలీలు అంతకు ముందు త్రైమాసికం కన్నా.. 58 శాతం పెరిగాయని నివేదికలో తేలింది. అదే సమయంలో కార్డు చెల్లింపులు 11 శాతం తగ్గిపోయినట్లు నిర్వాహకులు తెలిపారు.

గూగుల్ పే నే ఎక్కువ...

రెండో త్రైమాసికంలో ఆన్​లైన్​ నగదు బదిలీ చెల్లింపుల యాప్​ గూగుల్​పేను హైదరాబాద్ ప్రజలు ఎక్కువగా ఉపయోగించారు. మొత్తం యూపీఏ బదిలీల్లో దీని ద్వారానే 59 శాతం జరిగాయి. 32 శాతంతో రెండో స్థానాన్ని ఫోన్ పే ఆక్రమించింది.

రాష్ట్రాల వారిగా చూస్తే తెలంగాణ ఐదో స్థానం...

డిజిటల్ చెల్లింపులలో రాష్ట్రాల వారిగా చూస్తే తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నట్లు సర్వేలో తేలింది. కర్ణాటక, తమిళనాడు, దిల్లీ, మహారాష్ట్ర మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నట్లు తేలింది. తెలంగాణలో కూడా కేవలం రాజధానిలోనే కాకుండా సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్​, పాల్వంచ లాంటి నగరాల్లో అధికంగా డిజిటల్ నగదు చెల్లింపులు జరిగినట్లు రజోర్​పే నిర్వాహకులు తెలిపారు.

డిజిటల్ చెల్లింపుల్లో హైదరాబాద్ 2వ స్థానం

ఇవీ చూడండి: డిజిటల్​ లావాదేవీల్లో దూసుకుపోతున్న భారత్​

Intro:byte : Shashank kumar, CTO and cofounder , rezorpay

Body:byte : Shashank kumar, CTO and cofounder , rezorpay

Conclusion:byte : Shashank kumar, CTO and cofounder , rezorpay
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.