ETV Bharat / city

వేగంగా కదులుతున్న ప్రాంతీయ రింగ్‌రోడ్డు దస్త్రం - తెలంగాణ తాాజా వార్తలు

ప్రాంతీయ రింగ్​రోడ్డు దస్త్రం వేగంగా కదులుతోంది. ఈ రహదారిపై ట్రాఫిక్​ అంచనాలు రూపొందించి నెలాఖరులోగా పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి.. కేంద్రం నుంచి లేఖ వచ్చింది. 158 కిలోమీటర్ల ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ రహదారి నంబరు వచ్చింది. జూన్‌లోగా దక్షిణ భాగానికి కూడా భూసేకరణకు అనుమతి లభించనుంది.

hyderabad regional ring road
వేగంగా కదులుతున్న ప్రాంతీయ రింగ్‌రోడ్డు దస్త్రం
author img

By

Published : Apr 14, 2021, 7:29 AM IST

రాష్ట్రానికి మణిహారం కానున్న ప్రాంతీయ రింగ్‌రోడ్డు దస్త్రం చకచకా కదులుతోంది. జూన్‌లోగా దక్షిణ భాగానికి కూడా భూసేకరణకు అనుమతి లభించనుంది. ఉత్తర భాగానికి చెందిన పూర్తిస్థాయి సవివర నివేదిక (డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు) రూపొందించేందుకు కన్సల్టెంట్‌ నియామకానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. దక్షిణ భాగానికి జాతీయ రహదారి నంబరును కేటాయించేందుకు అవసరమైన ప్రాథమిక సమాచారం కోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

నివేదిక పంపండి..

హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌రోడ్డుకు 20 కిలోమీటర్ల అవతల 340 కిలోమీటర్ల పొడవునా ప్రాంతీయ రింగ్‌రోడ్డు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఈ మార్గం సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మీదుగా వెళ్తుంది. 158 కిలోమీటర్ల ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ రహదారి నంబరు వచ్చింది. దక్షిణ భాగానికి నంబరు కేటాయించాల్సి ఉంది.ఆ ప్రక్రియకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. అయిదేళ్ల తరవాత ట్రాఫిక్‌ ఏస్థాయిలో ఉంటుందో గణాంకాలను రూపొందించి పంపాలని కోరింది.

అదే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన..

ప్రస్తుతం అవుటర్‌ రింగ్‌రోడ్డును స్థానిక అవసరాల కన్నా జాతీయ రహదారులకు అనుసంధానం కోసం ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌లోకి భారీ వాహనాలను రాకుండా అవుటర్‌పైకి మళ్లిస్తున్నారు. ప్రాంతీయ రింగురోడ్డు పూర్తయితే ఆ వాహనాలన్నింటినీ పూర్తిగా ఆ మార్గంపైకే మళ్లించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అప్పుడు అవుటర్‌ రింగ్‌రోడ్డు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అవసరాలకు ఉపయోగపడుతుందని భావిస్తోంది.

జూన్​నాటికి..

ప్రాంతీయ రింగ్‌రోడ్డుపై ఎంత ట్రాఫిక్‌ ఉండవచ్చో అంచనా వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నెలాఖరుకు ఈ అధ్యయనం పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపే ఆనివేదికను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిశీలించి జాతీయ రహదారుల నంబరును కేటాయిస్తుంది. తర్వాత ఆ మార్గంలో భూసేకరణకు అనుమతి ఇస్తుంది. ఆపై క్షేత్రస్థాయి పరిస్థితులపై సవివర నివేదికను రూపొందించేందుకు కన్సల్టెంట్‌ను నియమిస్తుంది. ఇదంతా జూన్‌లోగా పూర్తవుతుందని భావిస్తున్నారు.

ఇవీచూడండి: రీజనల్‌ రింగ్‌ రోడ్​తో పరిసర ప్రాంతాల అభివృద్ధి: గణపతి రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.