ETV Bharat / city

గుంటూరు శ్రీను కోసం పోలీసుల ముమ్మర గాలింపు - bhuma akhila priya arrest updates

బోయినపల్లి కిడ్నాప్​ కేసు వ్యవహారంలో పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసులో భూమా కుంటుబానికి నమ్మకస్థుడైన గుంటూరు శ్రీను హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు... అతని కోసం గాలిస్తున్నారు. గుంటూరు శ్రీను దొరికితే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు.

hyderabad police searching for guntur srinu

author img

By

Published : Jan 8, 2021, 6:45 PM IST

కటికనేని సోదరుల అపహరణ కేసులో కీలకంగా వ్యవహరించిన గుంటూరు శ్రీను కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. భూమా నాగిరెడ్డికి సహాయకుడిగా ఉంటూ ఎంతో నమ్మకం పొందిన గుంటూరు శ్రీను... వాళ్ల కుటుంబానికి చెందిన అన్ని విషయాలను దగ్గరుండి మరీ చూసుకునేవాడు. భూమా నాగిరెడ్డి మరణాంతరం... ఏవీ సుబ్బారెడ్డితో భూమా అఖిలప్రియకు విభేదాలు తలెత్తిన సమయంలో గుంటూరు శ్రీను అఖిలప్రియకు మద్దతుగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఏవీ సుబ్బారెడ్డిని చంపేందుకు కుట్ర పన్ని పోలీసులకు దొరికిపోయాడు.

ఈ కేసులో కడప జైల్లో రెండు నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్​పై బయటికి వచ్చాడు. హఫీజ్​పేట్ భూమి విషయంలోనూ కటికనేని సోదరులతో తలెత్తిన విభేదాల కారణంగా... వాళ్లను అపహరించడానికి దాదాపు రెండు నెలల క్రితం ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు శ్రీను... పలుమార్లు బోయిన్​పల్లి పరిసరాల్లో సంచరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.

ప్రస్తుతం పరారీలో ఉన్న గుంటూరు శ్రీను దొరికితే ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్​రామ్​ కూడా బెంగళూరులో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు అక్కడ గాలింపు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: భూమా అఖిలప్రియను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.