రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలతోపాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీష్‌గఢ్ వరకు 5.8కిమీ ఎత్తు వద్ద ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించారు.
ఇదీ చదవండి : 'మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రతిపక్షాల కుట్ర'