ETV Bharat / city

బృహత్తర ప్రణాళికలతో విశ్వనగరంగా హైదరాబాద్​ - Hyderabad is a cosmopolitan cit

విశ్వనగరం... భాగ్యనగరం ముందున్న ప్రస్తుత లక్ష్యం. లివబుల్‌, లవబుల్‌ సిటీగా ఒక్కోమెట్టు ఎదుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెట్టుబడుల గమ్యస్థానంగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. కోటిన్నర దాటిన జనాభా అవసరాలు తీర్చేందుకు.. బృహత్తర ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. రహదారుల అభివృద్ధి, ఐటీ కారిడార్, మెట్రో రైలు వంటి ప్రాజెక్టులతో పౌర సేవలను మరింత మెరుగుపర్చడంలో విజయవంతంగా సాగుతున్న భాగ్యనగరం... బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఎంతో మందిని అక్కున చేర్చుకుని కాపాడుకుంటోంది. అయినా సాధించాల్సింది... ఇంకా ఉంది. పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా నగర రూపురేఖల్లో వచ్చిన మార్పులు, ఇక్కడ జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక కథనం.

hyderabad
బృహత్తర ప్రణాళికలతో విశ్వనగరంగా హైదరాబాద్​
author img

By

Published : Nov 18, 2020, 9:06 PM IST

Updated : Nov 19, 2020, 7:43 AM IST

పరిధులు దాటి విస్తరిస్తున్న మహానగరం హైదరాబాద్‌ను... సుదీర్ఘ కాలంగా ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. వాటి పరిష్కారానికి బృహత్తర్‌ ప్రణాళికను రూపొందించి బల్దియా... ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ విశ్వనగరం వైపు పరుగులు పెడుతోంది. ఏ నగరం ఒక్క రోజులోనో, ఒక్క ఏడాదిలో పూర్తి స్థాయి అభివృద్ధి సాధించలేదంటున్న అధికారులు... సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల కలయికగా సరికొత్త ప్రణాళికలను రూపొందించారు. రోజురోజుకు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంతో పాటు...రానున్న మూడు దశాబ్దాల్లో ఎదురుకానున్న సవాళ్లను అధిగమించేలా పక్కా ప్రణాళికలతో ముందుడుగు వేస్తున్నారు.

పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్​..

ఏ ఒక్క రంగంలోనో అభివృద్ధి చెందితే సరిపోదని భావిస్తున్న అధికార యంత్రంగం.... అన్ని విభాగాలను సమానంగా వృద్ధి బాట పట్టించేందుకు కృషిచేస్తోంది. ప్రపంచ దేశాలతో పోటీపడే అత్యుత్తమ నగరాల్లో మేటిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. సురక్షితమైన తాగునీరు, కట్టుదిట్టమైన శాంతి భద్రతలు, మెరుగైన రవాణా సదుపాయాలను కల్పిస్తున్న ప్రభుత్వం...హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు కృషిచేస్తోంది. అంతర్జాతీయ వేదికలపై నగర విశిష్టతలను చాటిచెబుతోంది. వీటితో పాటుగా అనువైన భౌగోళిక వాతావరణం, స్థిరాస్తి రంగ వృద్ధి... జనాభాతో పాటుగా పెరుగుతున్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని... అంతర్జాతీయం సంస్థలు ఇక్కడికి వరుస కడుతున్నాయి.

ఓవైపు రాజకీయ స్థిరత్వం.. మరోవైపు..

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో రాజకీయ స్థిరత్వం ఎంత ముఖ్యమో...శాంతిభద్రతలు అంతే ముఖ్యమని భావించిన ప్రభుత్వం...పోలీస్‌ యంత్రాంగానికి ఆధునిక సదుపాయాలు కల్పించింది. పోలీసు, నిఘా వ్యవస్థలను పటిష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోలీసు వ్యవస్థను ఆధునికీకరించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలను ఒకేచోట నుంచి మానిటర్‌ చేసేలా 19 అంతస్థులతో రూపొందించిన భారీ ఐకానిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణానికి రూపకల్పన చేసింది. షీ టీమ్స్, షీ షటిల్స్, షీ క్యాబ్స్, మహిళా పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చి మహిళకు ప్రత్యేక భరోసా కల్పిస్తోంది.

దుర్గం చెరువు తీగల వంతెన

ట్రాఫిక్‌ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. వాటితో పాటే.. రహదారుల సమస్యను తీర్చేందుకు వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం కింద రోడ్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా...ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, లింక్‌రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. వాటిలో ఇప్పటికే చాలావరకు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా గతంలో ట్రాఫిక్‌ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆ ప్రాంత వాసులు ఊరట కలిగింది. ఇక రాష్ట్ర పర్యాటకానికి ఆధునిక చిహ్నంగా మారిన దుర్గం చెరువు తీగల వంతెనను.. రూ.184 కోట్లతో నిర్మించారు. ఈ వంతెన కారణంగా... ఐటీ కారిడార్ ప్రయాణం సౌకర్యవంతంగా, సులభతరంగా మారింది. లాక్‌డౌన్ సమయంలో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న జీహెచ్ఎంసీ... దాదాపు 250 కిలోమీటర్ల రోడ్డు పనులను పూర్తి చేసింది. మరో 126 కిలోమీటర్ల మేర లింకురోడ్ల నిర్మాణాన్ని చేపట్టి ట్రాఫిక్ చిక్కుల నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగించింది.

ఒక్కసారైనా మెట్రో ఎక్కాలని..

ఇక నగర ప్రజలకు అందివచ్చిన మరో ఆధునిక సౌకర్యం.. మెట్రోరైలు. ఇది హైదరాబాద్‌ ముఖచిత్రాన్నే మార్చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో.. నగరంలో ప్రధాన ప్రాంతాలను కలుపుతూ 72 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో మార్గం...నగర ప్రజలకు ఎంతో ఉపకరిస్తోంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి మియాపూర్‌, అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ కారిడార్​లో మెట్రో సేవలు అందుబాటులోకి రావడం వల్ల ఆ మార్గాల్లో రవాణా వ్యవస్థ పుంజుకుంది. నగరానికి వచ్చిన వారెవరైనా... ఒక్కసారైనా మెట్రోలో ప్రయాణించాలనే విధంగా అందరినీ ఆకర్షిస్తోంది హైదరాబాద్‌ మెట్రో.

ఇవాంక ట్రంప్​ రాకతో..

హైదరాబాద్‌లోని ఐటీ రంగం శరవేగంగా వృద్ధి సాధిస్తోంది. దీంతో ప్రపంచ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. గూగుల్, అమెజాన్, మైక్రోస్టాప్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం హైదరాబాద్​నే కేంద్రంగా ఎంచుకోవడం విశేషం. ఇప్పటికే ఇక్కడ నుంచి పనిచేస్తున్న సంస్థలు... విస్తరణకు భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఐటీకి కేంద్రంగా ఉన్న సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాలు... అంతర్జాతీయ సంస్థల ప్రవేశంతో ఆధునికతను సంతరించుకుంటున్నాయి. ఐటీతో పాటు ఇతర పారిశ్రామిక రంగాల అభివృద్ధికి హైదరాబాద్‌ పాలనా యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఇవాంక ట్రంప్ ముఖ్య అతిథిగా జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ సమ్మిట్...ప్రపంచ సంస్థలను ఆకర్షించింది. పరిశ్రమలకు కల్పించిన ప్రత్యేక రాయితీలు, ఫార్మా సిటీ కోసం నగర శివార్లలో భూముల కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలను ఆకర్షించింది. ప్రస్తుతం బహుళజాతి సంస్థలతో పాటు దేశీయ సంస్థలకు కూడా హైదరాబాద్ గమ్యస్థానంగా మారింది. అమెజాన్ తన అతిపెద్ద క్యాంపస్​ను హైదరాబాద్​లో ప్రారంభించింది. ప్రైవేట్‌ సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన ఆఫీస్ స్పేస్ లీజు విషయంలోని హైదరాబాద్ బెంగళూరును అధిగమించిదంటే... హైదరాబాద్‌ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు.

హాపనింగ్ హైదరాబాద్ పేరుతో ..

నగరంలో స్థిరాస్తి రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. దీనికి ఐటీ, పారిశ్రామిక రంగాల జోరు కలిసొస్తుంది. సింగిల్ విండో విధానంలో... 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తుండడంతో నగర శివారుల్లో నూతన నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఫలితంగా నగర రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయి. నగరంలో పచ్చదనం పెంచేందుకు హరితహారంలో భాగంగా 10 కోట్లకు పైగా మొక్కలు నాటారు. నగరంలో 36 శ్మశాన వాటికలను ఆధునీకరణ పనులు ప్రారంభించి.. కొన్నింటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. నగర పౌరులు ఆహ్లాదంగా గడపడానికి హాపనింగ్ హైదరాబాద్ పేరుతో ఏడాది పొడవునా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ కేంద్రాలు.. రెండు పడక గదుల ఇళ్లు..

సంక్షేమ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...నగరంలోని పేద ప్రజలకు లక్ష రెండు పడకల గదులు ఇళ్లు నిర్మించి ఇస్తోంది. నగరంలో ఇప్పటికే.... 13 మురికివాడల్లోని 17 ప్రదేశాల్లో రెండు పడకల గదుల ఇళ్ల పట్టాలిచ్చి పేద కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. ఇక పేద వారి ఆకలి తీర్చేందుకు నగరంలో విరివిగా అన్నపూర్ణ కేంద్రాలను తెరిచారు. వీటి ద్వారా కేవలం 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తూ... రోజు 35 వేల మంది ఆకలి తీర్చుతున్నారు. ఇక అందరికీ వైద్య సదుపాయాలు అందాలనే లక్ష్యంతో.. నగరంలో 223కు పైగా బస్తీ దవాఖాలను ఏర్పాటు చేశారు. ప్రతి పౌరునికి పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టిన జీహెచ్ఎంసీ..... 5 వేల కోట్లతో గోదావరి మొదటి దశ, కృష్ణా మూడో దశ తాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదిన పూర్తి చేసింది. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 4 వేల 225 మరుగుదొడ్లను ఏర్పాటు చేసి... బహిరంగ మల, మూత్ర విసర్జన నిర్మూలనకు ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతమున్న మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల మేరకు పనులు చేపడుతుతున్న ప్రభుత్వం... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల అవసరాలను తీరుస్తూ విశ్వనగరానికి ఉండాల్సిన అన్ని లక్షణాలను హైదరాబాద్ నగరానికి తీసుకొస్తుంది.

Last Updated : Nov 19, 2020, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.