ETV Bharat / city

అభివృద్ధి పనుల్లో మాయాజాలం.. బిల్లుల్లో గందరగోళం - Confusion in Hyderabad development works

హైదరాబాద్​లో 3వేల అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల్లో గందరగోళం నెలకొంది. ఆ పనులు జరిగాయే లేదో కూడా అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. వీటికి సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్​లో ఉన్న రూ.9 కోట్ల బిల్లులను చెల్లించాలని గుత్తేదారులు కోరుతున్నారు. ఎట్టకేలకు వీటి నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ రంగంలోకి దిగింది.

Hyderabad, pending bills, vigilance
హైదరాబాద్​, అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లులు
author img

By

Published : Mar 28, 2021, 9:26 AM IST

  • టోలిచౌకి సెక్షన్‌ పరిధిలోని నదీమ్‌ కాలనీలో 100ఎంఎం, 150ఎంఎం డయా వాటర్‌ పైపులైన్‌కు రూ.98 వేలతో మరమ్మతులు చేసినట్లు పని చూపించారు. ఈ పనులు 2008లో జరిగినట్లు అందులో పేర్కొన్నారు. ఈ బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పనులు జరిగినట్లు వివరాలు అందుబాటులో లేవు.
  • హకీంపేట రోడ్డులో 2009లో రూ.80 వేలతో జంక్షన్‌ పనులు చేసినట్లు బిల్లులు పెట్టారు. ఈ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అసలు పనిచేశారో...లేదంటే తప్పుడు ఎస్టిమేట్లు తయారు చేశారో గుర్తించలేకపోతున్నారు.

ఇలా...ఒకటి కాదు..రెండు కాదు... భాగ్యనగర వ్యాప్తంగా 3 వేల పనులకు సంబంధించిన బిల్లుల్లో మాయాజాలం చోటుచేసుకుంది. అసలు ఆ పనులు జరిగాయో లేవో కూడా అధికారులు తేల్చుకోలేక పోతున్నారు. వీటికి సంబంధించి రూ.9 కోట్ల విలువైన బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా మొత్తాలను విడుదల చేయాలని గుత్తేదారులు పదేపదే అధికారులను కోరుతుండటంతో ఎట్టకేలకు వీటి నిగ్గు తేల్చేందుకు విజిలెన్సు రంగంలోకి దిగింది. చాలా పనులకు సంబంధించి పేపర్లపై లెక్కలు తప్ఫ...స్థానికంగా పనులు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించడం లేదని సమాచారం. వాస్తవానికి పని చేసిన నెల, రెండు నెలల్లో బిల్లులు మంజూరు చేస్తుంటారు.

అయితే ఈ 3 వేల పనులకు సంబంధించి 10-15 సంవత్సరాలు గడుస్తోంది. ఇంతవరకు ఎందుకు పెండింగ్‌లో పెట్టారనేది కూడా ప్రశ్నార్థకమే. ఇలాంటి పనులను ఎక్కువ శాతం మంది జలమండలి ఆస్థాన గుత్తేదారులే చేస్తుంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిలో చాలామందికి స్థానిక రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటున్నాయి. డివిజన్‌ 1-4 వరకు కొద్ది మంది గుత్తేదారులే చేసినట్లు తెలుస్తోంది. బిల్లుల కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని డివిజన్లలో పనులను పరిశీలించిన అధికారులకు సరైన ఆధారాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. కొందరు అప్పణంగా జలమండలి నుంచి నిధులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.