జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఉస్మానియా వర్సిటీలో డీఆర్సీని పరిశీలించిన సీపీ... ఎస్ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు.
సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లేవారు లెక్క చూపాలని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంజనీకుమార్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: తెరాసపై ఎన్నికల కమిషనర్‌కు ఉత్తమ్‌కుమార్ ఫిర్యాదు