ETV Bharat / city

లెక్కలు తీశారు.. సక్కగుండాలే! - హైదరాబాద్​ ట్రాఫిక్ పోలీస్​ చేతిలో సాంకేతిక అస్త్రం

ప్రస్తుత పరిస్థితుల్లో నగర పోలీసులకు దొరకకుండా తిరిగే వాహనదారుల పనిపట్టేందుకు సాంకేతిక అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. రద్దీ కూడళ్లలో లాక్‌డౌన్‌కు ముందు గంటకు ఎన్ని వాహనాలు వెళ్లాయి? ప్రస్తుతం ఎన్ని వెళ్తున్నాయి? అనే లెక్కలు తీశారు. అనవసరంగా రోడ్డెక్కితే ముందు కూడళ్లల్లో వాహనం స్వాధీనం చేసుకోనున్నారు.

Hyderabad city police introduced new technology for catch rules break vehicles in  city
లెక్కలు తీశారు.. సక్కగుండాలే!
author img

By

Published : Apr 15, 2020, 8:56 AM IST

హైదరాబాద్​ నగరంలోని 20 రద్దీ కూడళ్లను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. రద్దీ కూడలిలో లాక్‌డౌన్‌ లేని సమయంలో గరిష్ఠంగా ఒకవైపు వెళ్లిన వాహనాల సంఖ్యకు, లాక్‌డౌన్‌ ఉన్నప్పుడు వాహనాల సంఖ్యను పోల్చారు. సాధారణ రోజుల్లో రద్దీ సమయంలో ఒకవైపు వెళ్లిన వాహనాలు 10వేలు ఉంటే అందులో ఐదు శాతం నుంచి 30శాతం వరకు వాహనాలు మాత్రమే వెళ్లాలని లెక్కకట్టారు. అంతకుమించి వాహన రద్దీ ఉంటే ఆ కూడళ్ల వద్ద ప్రత్యేక బృందాలు ఉంటాయి. వచ్చిన ప్రతి వాహనదారుడిని ఆరా తీసి.. సరైన కారణం చెప్పకపోతే కేసులు నమోదు చేస్తాయి.

ప్రత్యక్ష పరిశీలన

వాహనాల రాకపోకలపై ట్రాఫిక్‌ పోలీసు సహాయ వాణికి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై చర్యలు చేపట్టేందుకు బషీర్‌బాగ్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. కెమెరాల ద్వారా అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ అధికారులు, సిబ్బందికి సూచనలిస్తున్నారు. వారు స్పందించి నిబంధనల ఉల్లంఘనులపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

నిబంధనల ఉల్లంఘనులపై 15,043 కేసులు

నిబంధనలు కాదని రోడ్లపైకి వచ్చిన 15,658 మంది వాహనదారులపై మంగళవారం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో 2564 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు సీపీ(ట్రాఫిక్‌)అనిల్‌ కుమార్‌ తెలిపారు.

ఇదీ చూడండి: గాంధీలో ముగ్గురు రోగులకు ప్లాస్మా చికిత్స!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.