ETV Bharat / city

లాక్​డౌన్​ ఊహాగానాలు.. కిటకిలాడుతున్న రైలు, బస్ స్టేషన్లు

హైదరాబాద్​లో లాక్​డౌన్​ను మరోసారి అమలుచేస్తారనే ప్రచారం నేపథ్యంలో ప్రజలు సొంతూళ్లకు క్యూ కడుతున్నారు. టోల్​ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. రైల్వే, బస్​ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

rush in hyderabad
రద్దీ: కరోనా భయాలు.. లాక్​డౌన్​ ఊహాగానాలే కారణం
author img

By

Published : Jul 1, 2020, 5:36 PM IST

రద్దీ: కరోనా భయాలు.. లాక్​డౌన్​ ఊహాగానాలే కారణం

హైదరాబాద్​లో లాక్​డౌన్​ ఊహాగానాలు, కరోనా ఉద్ధృతి కారణంగా ప్రజలు సొంతూళ్లకు పయమవుతున్నారు. అన్నిసేవలు నిలిపివేస్తారనే భయంతో స్వగ్రామాలకు వెళ్తున్నారు. లాక్‌డౌన్‌ అమలు చేస్తే ఇక్కడ అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఏదైనా అత్యవసర అవసరాలు ఉన్నవారు కూడా ముందుగానే వచ్చి... పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఫలితంగా రైల్వే, బస్​ స్టేషన్లలో రద్దీ నెలకొంటొంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు 34 రైళ్లను నడిపిస్తున్నారు. వీటిలో రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి రైలు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. జంటనగరాల మీదుగా 22, ఆంద్రప్రదేశ్ మీదుగా 10, మహారాష్ట్ర మీదుగా రెండు రైళ్లను నడిపిస్తున్నారు.

20 శాతం ప్రయాణికులు పెరిగారు..

మరోవైపు ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి ప్రధాన బస్​స్టేషన్లలో 15 నుంచి 20 శాతం ప్రయాణికులు అదనంగా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, గృహిణులు ఎక్కువగా వెళ్తున్నారన్నారు. ఉప్పల్, ఎల్​బీనగర్ ప్రాంతాల నుంచి ప్రయాణించేవారి సంఖ్య పెరిగింది.

టోల్​ప్లాజాల వద్ద రద్దీ..

టోల్​ ప్లాజా వద్ద కూడా భారీగా వాహనాలు బారులు తీరుతున్నాయి. స్వగ్రామాలకు వెళ్లేవారు సొంతవాహనాల్లో ఎక్కువగా ప్రయాణిస్తుండడంతో రద్దీ ఏర్పడుతోంది. విజయవాడ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు వెళ్లే వారి వాహనాలతో విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్‌లో వాహనాల సంఖ్య పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద సాధారణ రోజులతో పోలిస్తే వాహనాలు ఎక్కువగానే వెళ్లినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఫాస్టాగ్ ఉన్న వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు లేవని... ఫాస్టాగ్ లేని వాహనాలతోనే కాస్త ట్రాఫిక్ జామ్ అవుతుందని టోల్ గేట్ నిర్వాహకులు పేర్కొంటున్నారు.

ఇవీచూడండి: లాక్​డౌన్​ ఎఫెక్ట్: గూడూరు టోల్​ప్లాజా వద్ద వాహనబారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.