ETV Bharat / city

Liquor Tenders: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు.. ఖజానా పుల్​ - Liquor Tender applications

రాష్ట్రంలోని 34 ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలో మొత్తం 2620 మద్యం దుకాణాలకు (Liquor Tenders in telangana) 60,433 దరఖాస్తులు అందాయి. దీంతో 1,200 కోట్లకుపైగా మొత్తం ఆదాయం ఎక్సైజ్‌ శాఖకు వచ్చింది.

Liquor Tenders
Liquor Tenders
author img

By

Published : Nov 18, 2021, 10:58 PM IST

రాష్ట్రంలో మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ సాయంత్రం 7 గంటల వరకు 60 వేలకుపైగా వచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ (Liquor Tenders in telangana) అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలో ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 2620 మద్యం దుకాణాలకు 60,433 దరఖాస్తులు అందాయి. ప్రతి దరఖాస్తుకు రెండు లక్షలు రూపాయిలు నాన్‌ రిఫండ్‌బుల్‌ మొత్తం ఎక్సైజ్‌ శాఖకు (Liquor Tenders in telangana) రాబడిగా వస్తుంది. దీంతో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా 1,200 కోట్లకుపైగా మొత్తం ఆదాయం ఎక్సైజ్‌ శాఖకు వచ్చింది. ఒక్కో దుకాణానికి సగటున 23 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఖమ్మం జిల్లాల్లో 122 మద్యం దుకాణాలకు 6,084 దరఖాస్తులు రావడంతో ఒక్కో దుకాణానికి అత్యధికంగా (Liquor Tender applications) 50 దరఖాస్తులు వచ్చినట్లయింది. కొత్తగూడెం ఎక్సైజ్‌ జిల్లాల్లో 88 మద్యం దుకాణాల కోసం ఇప్పటి వరకు 3,699 దరఖాస్తులు రావడంతో ఒక్కో దుకాణానికి 42 వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెద్దపల్లి ఎక్సైజ్‌ జిల్లాలో 77 మద్యం దుకాణాలకు కేవలం 849 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా నిర్మల్‌ ఎక్సైజ్‌ జిల్లాలో 47 మద్యం దుకాణాలకు 524 దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండు జిల్లాల్లో ఒక్కో మద్యం దుకాణానికి సగటున 11 దరఖాస్తులు అందినట్లు అధికారులు వివరించారు. దరఖాస్తులకు సంబందించి.. పూర్తి వివరాలు రావాల్సి ఉండడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 82 మద్యం షాపులకు (Liquor Tender applications) 1379 అప్లికేషన్లు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్​ సూపరింటెండెంట్ కృష్ణ ప్రియ వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని మొత్తం 67 దుకాణాలకు గాను ఇప్పటివరకు 1,482 దరఖాస్తులు వచ్చాయని జిల్లా సూపరింటెండెంట్​ దత్తురాజ్ గౌడ్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 94 దుకాణాలకు ఇప్పటికే 1400కుపైగా దరఖాస్తులు వచ్చాయని మరో 600 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదీచూడండి: NIA raids in Telugu states : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్‌ఐఏ సోదాలు.. కీలక దస్త్రాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.