ETV Bharat / city

100% Occupancy in AP Cinema Theaters : ఏపీలోని థియేటర్లలో వందశాతం ఆక్యుపెన్సీ - 100% Occupancy in AP Theaters

100% Occupancy in AP Cinema Theaters : కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఏపీలోని సినిమా థియేటర్లలో వందశాతం ఆక్యుపెన్సీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇవాళ్టి నుంచే వందశాతం ఆక్యుపెన్సీ అమలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

cinema theatres news
cinema theatres news
author img

By

Published : Feb 18, 2022, 10:02 AM IST

100% Occupancy in AP Cinema Theaters : కరోనా ఉద్ధృతి తగ్గటంతో సినిమా థియేటర్లలో వందశాతం ఆక్యుపెన్సీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా నిబంధనల మేరకు థియేటర్లలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ్టి నుంచే వందశాతం ఆక్యుపెన్సీ అమలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

సినిమా టికెట్ల ధరలపై త్వరలోనే నిర్ణయం..

100% Occupancy in AP Cinema Halls : సినిమా టికెట్ల ధరలపై త్వరలోనే నిర్ణయం వస్తుందని.. ఫిల్మ్‌ ఛాంబర్ సభ్యులు తెలిపారు. ప్రజలు, సినిమా పరిశ్రమ సంతృప్తి చెందేలా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. మూడు స్లాబుల్లో టికెట్ల ధరలు ఉంటాయని.. ప్రేక్షకులు ఇబ్బందిపడే సమస్యలన్నీ తొలగిపోతాయని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.

"టికెట్ల ధరలు సహా అన్ని అంశాలూ చర్చించాం. కమిటీలో అధ్యయనం చేశాక ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. అనంతరం ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది. టికెట్ల ధరల నిర్ణయానికి స్లాబులపై చర్చించాం. ధరలపై తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.ప్రజలు, సినీ పరిశ్రమను సంతృప్తిపరిచేలా నిర్ణయాలుంటాయి. ధరలపై పది రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సినీ ప్రముఖుల అభిప్రాయాలకు మా ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. మేకింగ్ మని రూ.100 కోట్లు దాటితే స్పెషలైజ్డ్‌గా పరిగణించే అంశంపై చర్చిచాం. అలాగే థియేటర్లలో ఐదో షో పైనా సమావేశంలో చర్చించాం. ప్రదర్శనలకు సంబంధించి చిన్న సినిమాలకు ప్రాధాన్యత ఉంటుంది. కమిటీ సమావేశం మళ్లీ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ ప్రేక్షకులు ఇబ్బందిపడే సమస్యలన్నీ తొలగిపోతాయి. టికెట్ల ధరల నిర్ణయానికి థియేటర్లలో 3 స్లాబులు ఉంటాయి."

- ముత్యాల రాందాస్‌ , తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌

ఇదీచూడండి: ట్రెండ్ మారింది.. స్టోరీ సెలక్షన్ అదిరింది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.