సాంకేతికత ఎంత పెరిగినా ప్రతి శాఖలో పీఆర్వోల పాత్ర కీలకమైందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. దేశంలో ఉన్నా ప్రతి ఒక్క శాఖలో బాధ్యతాయుతమైన పీఆర్వోల ద్వారానే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన 33వ నేషనల్ హ్యూమన్ రిలేషన్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసులకు, మీడియాకు, ప్రజలకు వారధిలా వ్యవహరించే పీఆర్వోల సేవలను ఆయన కొనియాడారు. దేశ ప్రధాని నుంచి జిల్లా కలెక్టర్ వరకూ పనిచేస్తున్న ప్రతి ఒక్క పీఆర్వో సేవ మరువలేనిదని... వారికి గుర్తింపు కరవైందని 2019 ఉత్తమ పీఆర్వో మేనేజర్ అవార్డ్ గ్రహీత పి.నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ పత్రికల ప్రతినిధులు, పీఆర్వోలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'ఫలితాల విషయంలో ఆందోళన చెందవద్దు'