ETV Bharat / city

కొత్త మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు.. ఎంత ఆదాయం వచ్చిందంటే..?

కొత్త మద్యం దుకాణాల(new liquor shops in telangana 2021) ఏర్పాటు కోసం భారీగా దరఖాస్తులు(application for liquor license) వచ్చాయి. 2,620 మద్యం దుకాణాలకు గానూ.. 66,452 దరఖాస్తులు(application for liquor license) వచ్చాయి. ఈ దరఖాస్తుల ద్వారా రూ.1329 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.

huge number of applications for new liquor shops in telangana 2021

author img

By

Published : Nov 19, 2021, 4:46 AM IST

రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల(new liquor shops in telangana 2021) ఏర్పాటు కోసం భారీగా దరఖాస్తులు(application for liquor license) వచ్చాయి. 2,620 మద్యం దుకాణాలకు గానూ.. 66,452 దరఖాస్తులు(application for liquor license) వచ్చినట్లు ఎక్సైజ్​ శాఖ వెల్లడించింది. నిన్నటితో(నవంబర్​ 18) దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. గురువారం ఒక్కరోజే 35,762 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్​ శాఖ స్పష్టం చేసింది. అంతకుముందు అందిన 30,690తో కలిపితే 66,452 అయ్యాయి. ఈ దరఖాస్తుల ద్వారా రూ.1329 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.

చివరి రెండు రోజుల్లోనే..

రాష్ట్రంలో డిసెంబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలు(new liquor policy in telangana 2021)లోకి రానుంది. అందులో భాగంగా రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఏర్పాటు(application for liquor license)కు ఎక్సైజ్​ శాఖ ఈ నెల 9వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మంగళవారం వరకు లిక్కర్ వ్యాపారుల నుంచి అబ్కారీ శాఖ ఆశించిన స్థాయిలో స్పందన లేదు. 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 14,751 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కానీ.. చివరి రెండు రోజులు(బుధవారం, గురువారం) మాత్రం దరఖాస్తులు జోరుగా వచ్చాయి. బుధవారం రోజు 15,939 దరఖాస్తులు అందగా.. చివరిరోజైన గురువారం మాత్రం ఏకంగా.. 35,762 దరఖాస్తులు అందాయి.

అత్యధికంగా ఖమ్మంలోనే..

గురువారం అర్ధరాత్రి వరకు అందిన సమాచారం మేరకు మొత్తం 66,452 దరఖాస్తులు అందినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. ఒక్కో మద్యం దుకాణానికి 25కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 122 మద్యం దుకాణాలకు ఏకంగా 6,212 దరఖాస్తులు రావడంతో ఒక్కో మద్యం దుకాణానికి 51 దరఖాస్తులు అందాయి. ఇదే ఖమ్మం జిల్లాలో 2019 -21 ఎక్సైజ్ పాలసీలో ఒక్కో మద్యం దుకానాణానికి 48 దరఖాస్తులు అందినట్లు స్పష్టం చేసింది. అదేవిధంగా కొత్తగూడెం ఎక్సైజ్ జిల్లాకు 88 మద్యం దుకాణాలు ఏకంగా 4 వేల 270 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో మద్యం దుకాణానికి 48 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని 59 మద్యం దుకాణాలకు 1572 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా పెద్దవంగరలోని దుకాణానికి 69, అత్యల్పంగా గంగారంలోని దుకాణానికి 12 దరఖాస్తులు అందాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 230 దుకాణాలకు గానూ 4వేల 700 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ. 94 కోట్ల ఆదాయం సమకూరింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సర్కిల్​లోని 3 దుకాణాలకు అత్యధికంగా 90కి పైగా దరఖాస్తులు రాగా.. అలంపూర్, కల్వకుర్తి సర్కిళ్లలోనే అత్యధికంగా 40కి పైగా దరఖాస్తులు నమోదయ్యాయి.

లక్ష లక్ష్యం చేరలే..

2019-21 మద్యం విధి విధానాల ప్రకారం 2,216 మద్యం షాపులకు 49వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. నూతన మద్యం విధానంలో ఒక వ్యక్తి ఒకే దరఖాస్తు అన్న నిబంధనను తొలగించడంతో పాటు లైసెన్స్ విధానాన్ని సరళీకరణ చేశారు. ఇలా చేయడం వల్ల భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ అంచనా వేసింది. ఇప్పుడున్న 2,216 దుకాణాలకు కొత్తగా మరో 404 దుకాణాలు అదనంగా ఏర్పాటు అవుతుండడంతో దాదాపు లక్ష దరఖాస్తులు వస్తాయని అంచనా వేశారు. కానీ.. స్పందన పెద్దగా లేకపోవటం వల్ల లక్ష లక్ష్యం కాస్తా.. 66 వేల దగ్గరే ఆగిపోయింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.