ETV Bharat / city

Bharat Biotech CMD: మానవ వనరులను మనమే ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం: కృష్ణా ఎల్లా

గొప్ప గొప్ప యుద్ధాలే శాస్త్ర సాంకేతిక రంగ వృద్ధికి దోహదపడ్డాయాని భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా అన్నారు. పెన్సిలిన్ వంటి వ్యాక్సిన్లు, యుద్ధ కారణంగానే అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఫార్మాఎక్సైల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎఫ్​టీసీసీఐ కార్యాలయంలో వాణిజ్య సప్తా: పేరుతో.. తెలంగాణ నుంచి విదేశాలకు ఎగుమతులకు పునరుజ్జీవ కల్పన, భారత సుస్థిరాభివృద్ధి అనే అంశాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Bharat Biotech
కృష్ణాఎల్లా
author img

By

Published : Sep 21, 2021, 5:23 PM IST

ఫార్మాఎక్సైల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎఫ్​టీసీసీఐ కార్యాలయంలో వాణిజ్య సప్తా: పేరుతో.. తెలంగాణ నుంచి విదేశాలకు ఎగుమతులకు పునరుజ్జీవ కల్పన, భారత సుస్థిరాభివృద్ధి అనే అంశాలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా పాల్గొన్నారు. గొప్ప యుద్ధాలే శాస్త్రసాంకేతిక రంగ వృద్ధికి దోహదపడ్డాయని భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా అన్నారు. పెన్సిలిన్ వంటి వ్యాక్సిన్లు, యుద్ధ కారణంగానే అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.

ప్రభుత్వాలు మారుతుండొచ్చు కానీ... సరైన అధికారులు ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రాల్లో వ్యాపార సంస్థల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఇక భవిష్యత్తంతా పర్సనలైజ్డ్ మందులదే అన్న కృష్ణా ఎల్లా.... ఫార్మా రంగంలో వృద్ధి సాధించాలంటే పరిశోధనల్లో ఉపయోగించే జంతువుల దిగుమతికి సంబంధించిన నిబంధనలు సడలించాలని కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఫార్మాఎక్సైల్ ఇండియా డీజీ ఉదయ భాస్కర్, భారత వాణిజ్య పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ శ్రీకర్ రెడ్డి, తెలంగాణ ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఫారెన్ ట్రేడ్ అడిషనల్ డీజీ సీతారామ్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

వ్యాపారవేత్తగా ఎవరికైనా విజయం సాధించాలని ఉంటుంది. ప్రభుత్వాలు మారడం సాధారణం. కానీ సరైన అధికారులు ఉన్నప్పుడే వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయి. చంద్రమోహన్​, షీలా బేడి జీనోమ్​ వ్యాలీ ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించారు. భారత్​ నుంచి ఏది ఎక్కువగా ఎగుమతి అవుతుందో తెలుసా..? చాలా మంది ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తులు అనుకుంటారు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం భారత్​ నుంచి ఎక్కువగా మానవవనరులు ఎగుమతి చేస్తున్నాం. ప్రపంచంలో మనం మానవవనరులు ఎగుమతి చేసే పెద్ద దేశంగా ఉన్నాం. మనవాళ్లు యూఎస్​, యూరోపియన్​, జపాన్​, చైనాలో చాలా మంది ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. చాలామంది అఫ్రికన్​ దేశాల్లో కూడా పని చేస్తున్నారు.

-డాక్టర్ కృష్ణాఎల్లా, భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ

Bharat Biotech: మానవ వనరులను మనమే ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం: కృష్ణాఎల్లా

ఇదీ చదవండి: Revanth Reddy's residence siege : రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.