ETV Bharat / city

Huge Inflow to Irrigation Projects ప్రాజెక్టులకు పోటెత్తుతోన్న వరద ప్రవాహం

author img

By

Published : Aug 16, 2022, 10:41 AM IST

Huge Inflow to Irrigation Projects రాష్ట్రంలో ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో.... కృష్ణా, గోదావరి జలాశయాల్లోకి నీరు చేరుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి దిగువకు నీరు పరుగులు పెడుతోంది. జూరాల, సుంకిశాల, కడెం ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.

Huge Inflow to Irrigation Projects
Huge Inflow to Irrigation Projects

Huge Inflow to Irrigation Projects తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. జూరాల, సుంకిశాల నుంచి శ్రీశైలం జలాశయానికి 3 లక్షల 94 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు 15 అడుగులు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3 లక్షల 76 వేల క్యూసెక్కులు సాగర్‌కు వదలుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా....ప్రస్తుతం 884.40 అడులుగా ఉంది. పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలకు గాను....ప్రస్తుతం 212.43 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి చేసిన అనంతరం 62 వేల 92 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

Huge Inflow to Telangana Irrigation Projects జూరాల జలాశయంలోకి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి 3 లక్షల 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఫలితంగా 44 గేట్ల ద్వారదదాదాపు అదేస్థాయిలో నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.5 మీటర్లకు గాను... ప్రస్తుతం 317.8 మీటర్ల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ జలాశయం ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 26 గేట్లు ఎత్తి 3 లక్షల 17 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదలుతున్నారు. 18 గేట్లు 10 అడుగులు, 8 గేట్లు 5 అడుగులు మేర ఎత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.... ప్రస్తుతం 586 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 300 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 312 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3 లక్షల 69 వేల క్యూసెక్కులు ఉంది.

నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి జలాశయంలోకి మళ్లీ వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకు గాను.... ప్రస్తుతం 692.45 అడుగుల నీరు ఉంది. జలాశయంలోకి 7 వేల 201 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో 2 గేట్ల ద్వారా 10 వేల 243 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధతి క్రమంగా మరోసారి పెరుగుతోంది. ప్రస్తుతం 49.1 అడుగుల మేరు నీరు ప్రవహిస్తోంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 11 లక్షల 98 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో పరివాహన ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.