Fines For TRS Flexis: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన తెరాస ప్లీనరి సందర్భంగా.. నగరం మొత్తం ఎద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ఎక్కడ చూసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కట్అవుట్లతో భాగ్యనగరమంతా గులాబీమయం అయిపోయింది. తమ అభిమానాన్ని చాటుకునేందుకు శ్రేణులు.. ఎక్కడపడితే అక్కడ పెద్దపెద్ద ఫ్లెక్సీలు, కట్అవుట్లు ఏర్పాటుచేశారు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ ఫెక్సీలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం కొరడా ఝళిపించింది.
అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫెక్సీలపై అధికారులు జరిమానాలు విధించారు. అందులో భాగంగా.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు గానూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రూ.50 వేలు, తెరాస జనరల్ సెక్రటరీ కె.కేశవరావుకు రూ.65 వేలు, మైనంపల్లి రోహిత్‌కు రూ. 40 వేలు, దానం నాగేందర్‌కు రూ.5 వేలు, కాలేరు వెంకటేశ్‌కు రూ.10 వేల చొప్పున జరిమానాలు విధించింది. ట్విట్టర్లో ఫిర్యాదులు వచ్చిన వాటికి మాత్రమే ఈవీడీఎం జరిమానాలు విధించటం గమనార్హం.
ఇదీ చూడండి: