ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ అల్పాహారశాలకు సెప్టెంబర్ నెలలో.. 21 కోట్ల 48 లక్షల 62వేల 224 రూపాయల విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసిన హోటల్ నిర్వాహకులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఇంత హోటల్‌కు అంతా బిల్లా అంటూ నోరెళ్లబెట్టారు. గత నెలలోనూ ఇదే విధంగా రూ.47,148 విద్యుత్ బిల్లు వచ్చిందని వారు వాపోయారు. ఏం చేయాలో దిక్కుతోచక విద్యుత్ శాఖ ఆఫీసుకు పరుగులు తీశారు. విషయాన్ని అధికారులకు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదుతో కరెంట్ మీటర్లో సాంకేతికలోపాన్ని గుర్తించిన అధికారులు.. కొత్త మీటర్ అమర్చారు.
అయినప్పటికీ..!
మళ్లీ భారీగా బిల్లు రావడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. ప్రతి నెలా రూ.600 నుంచి రూ.700 మధ్య బిల్లు వస్తుందని, ఇలా ఎక్కువ మొత్తంలో రావడంతో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని బాధితులు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. చింతలపూడి మండలం విద్యుత్‌శాఖ ఏఈ శంకర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లగా.. సాంకేతికలోపం కారణంగా అంత బిల్లు వచ్చిందని.. దానిని సరిచేశామని తెలిపారు.
ఇదీచదవండి: