ETV Bharat / city

HOSPITAL TO APSRTC EMPLOYEES : ఏపీ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఆస్పత్రి

HOSPITAL TO APSRTC EMPLOYEES : ఏపీఎస్​ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్​లో ఓ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ తార్నాకలో ప్రస్తుతమున్న ఆర్టీసీ ఆస్పత్రిలోనే ఓ విభాగాన్ని ప్రారంభించింది.

HOSPITAL TO APSRTC EMPLOYEES, RTC hyderabad hospital
ఏపీ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఆస్పత్రి
author img

By

Published : Dec 19, 2021, 10:43 AM IST

HOSPITAL TO APSRTC EMPLOYEES : ఏపీఎస్‌ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు హైదరాబాద్‌లో ఉచిత వైద్యంతోపాటు మందులు అందనున్నాయి. హైదరాబాద్‌ తార్నాకలో ప్రస్తుతమున్న ఆర్టీసీ ఆస్పత్రిలోనే కొత్తగా ప్రత్యేక విభాగాన్ని ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు శనివారం ప్రారంభించారు.

అక్కడ సీనియర్‌ వైద్యాధికారి, ఫార్మసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే సుమారు రెండు వేల మంది డ్రైవర్లు, కండక్టర్లకు సైతం అత్యవసర సమయాల్లో ఇక్కడ వైద్యం అందిస్తారు. అవసరమైతే స్పెషాలిటీ ఆస్పత్రులకు సిఫారసు చేసే అధికారం వైద్యాధికారికి ఉంటుంది. కార్యక్రమంలో ఈడీ కోటేశ్వరరావు, ఆర్టీసీ ముఖ్య వైద్యాధికారి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Uyyalawada Narasimha Reddy : రేనాటి పౌరుషాన్ని తెల్లవారికి పరిచయం చేసిన ఉయ్యాలవాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.