వరద ముంపు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో నీటిని తొలగించేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పేరుకుపోయిన బురద, వ్యర్థాలను తొలగిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మోటార్లతో నీటిని తోడి పోస్తున్నారు.
ప్రధానంగా అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక రసాయనాలు చల్లుతున్నారు. సెల్లార్లలో ఊరుతున్న నీటిని ఎప్పటికప్పుడు ఇంటి యజమానులు తమవంతుగా తొలగించుకోవాలని.. అందుకోసం మోటార్లను అందుబాటులో ఉంచుకోవాలని చెబుతున్న అగ్నిమాపక శాఖ అధికారులతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి..
ఇవీచూడండి: వరదల నేపథ్యంలో భాగ్యనగరంలో ఇళ్లు భద్రమేనా?