ETV Bharat / city

న్యాయవాద దంపతుల హత్యలను ఖండించిన హోంమంత్రి - telangana crime news

హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యలను హేయమైన చర్యగా హోంమంత్రి మహమూద్​ అలీ అభివర్ణించారు. నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.

mahamood ali
న్యాయవాద దంపతుల హత్యలను ఖండించిన హోంమంత్రి
author img

By

Published : Feb 17, 2021, 10:12 PM IST

పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యలను హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఖండించారు. ఈ ఘటనను హేయమైన చర్యగా అభివర్ణించారు. దోషులు ఎంతటి వారైనా.. కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు.

నిందితులను పోలీసులు గుర్తించారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని డీజీపీ మహేందర్​రెడ్డిని ఆదేశించారు.

ఇవీచూడండి: పట్టపగలు న్యాయవాద దంపతుల దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.