పాతబస్తీలో పట్టభద్రుల ఓట్ల నమోదు కార్యక్రమం రికార్డ్ స్థాయిలో జరగాలని హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు. హైదరాబాద్ చాదర్ఘాట్ అజాంపురలోని ఓ ఫంక్షన్హాల్లో చార్మినార్, బహదూర్పురా, చాంద్రాయణ్గుట్ట నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
రాబోయే ఎన్నికల్లో ఎంఐఎంతో తెరాస స్నేహపూర్వక పోటీ ఉంటుందని హోంమంత్రి తెలిపారు. తన పర్యవేక్షణలో పది రోజుల పాటు పాత నగరంలో పట్టభద్రుల ఓటు నమోదు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్... ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్, భాజపా పార్టీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.