ETV Bharat / city

కొవిడ్ చికిత్సలో సౌలభ్యం.. ఇంటి వద్దకే వైద్యం - home isolation package for telangana covid patients

రెండో దశలో కొవిడ్ రాష్ట్రంలో విలయతాండవం చేస్తోంది. వేల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతుండటం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్ని బాధితులతో కిక్కిరిసిపోయాయి. ఆస్పత్రుల్లో బెడ్​ కావాలంటే నిరీక్షణ తప్పడం లేదు. ఐతే.. స్వల్ప లక్షణాలుంటే ఆస్పత్రికి వెళ్లకుండా.. వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్​లోనే చికిత్స తీసుకోవచ్చని పలువురు వైద్యులు సూచిస్తున్నారు.

home isolation package, home isolation package in telangana, telangana corona cases
హోం ఐసోలేషన్ ప్యాకేజీ, తెలంగాణలో హోం ఐసోలేషన్ ప్యాకేజీ, తెలంగాణలో కరోనా వ్యాప్తి
author img

By

Published : Apr 24, 2021, 7:31 AM IST

  • అమీర్‌పేటకు చెందిన సుధీర్‌(45) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఒంట్లో నలతగా ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనాగా తేలింది. ఆయన పలు ఆసుపత్రులకు ఫోన్లు చేయగా పడకలు ఖాళీ లేవంటూ సమాధానం వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఇంట్లోనే ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలని సూచించారు. హోం క్యారెంటైన్‌ ప్యాకేజీ తీసుకోవాలని చెప్పడంతో.. వారి సూచనలు, సలహాలతో 14 రోజుల్లోనే సుధీర్‌ కోలుకొని తిరిగి విధులకు హాజరయ్యాడు.

కరోనా రెండో విడత విజృంభిస్తుండడంతో గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు వెయ్యి మంది మహమ్మారి బారిన పడ్డారు. మరోవైపు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు ఇప్పటికే నిండిపోయాయి. గాంధీలో ఐసీయూలోని 500 పడకల్లోనూ రోగులు ఉన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రిలో బెడ్‌ కావాలంటే నిరీక్షణ తప్పడం లేదు. తీవ్ర లక్షణాలతోపాటు ఆక్సిజన్‌స్థాయి పడిపోయి కొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. మరికొందరిలో స్వల్ప లక్షణాలతోనే దవాఖానాలకు పరుగులు తీస్తున్నారు. అయితే, కరోనా బాధితులంతా ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని, వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకొని కోలుకోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు.

అందుబాటులో ప్యాకేజీలు..

కరోనా రోగుల చికిత్సకు నగరంలో పలు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఇప్పటికే హోం ఐసొలేషన్‌ ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చాయి. రోజుకు రూ. 300-రూ.1500 వరకు వసూలు చేస్తున్నాయి.

అపోలో, కిమ్స్‌, యశోద, కేర్‌, సన్‌షైన్‌, గ్లెనికల్స్‌ గ్లోబల్‌, కాంటినెంటల్‌, మెడికవర్‌, ఆస్టర్‌ ప్రైమ్‌ తదితర ఆసుపత్రులు హోం ఐసొలేషన్‌ ప్యాకేజీ సేవలను అందిస్తున్నాయి. ఆయా దవాఖానాల వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ వివరాలు పొందుపరిచి, ప్యాకేజీని ఎంపిక చేసుకుంటే... ఆసుపత్రి నుంచే ఫోన్‌ చేసి వివరాలను తెలుసుకొని సూచనలు, సలహాలు అందిస్తారు.

ప్రతి ఆసుపత్రి 10-15 రోజుల హోం క్యారెంటైన్‌ ప్యాకేజీ అందిస్తోంది. ఇందులో బేసిక్‌, అడ్వాన్స్‌డ్‌, స్టాండర్డ్‌, స్పెషల్‌, వీఐపీ ప్యాకేజీలు ఉన్నాయి. బేసిక్‌, స్టాండర్డ్‌ ప్యాకేజీలో రోజుకు రూ.300-500 వరకు చెల్లించాలి. ఈ ప్యాకేజీలో రోగిని మూడుసార్లు వైద్యుడు పర్యవేక్షిస్తాడు. నర్సింగ్‌ సిబ్బంది నిత్యం ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. మందులు, ఆహారాన్ని సూచిస్తారు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు తలెత్తి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే అందుకు సహకరిస్తూ.. పడకల పరంగా ప్రాధాన్యం ఇస్తారు.

ప్రత్యేక, వీఐపీ ప్యాకేజీలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నాయి. 14 రోజులపాటు రోజు విడిచి రోజు వైద్యుడు వీడియో కాల్‌లో రోగితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటాడు. నర్సులు నిత్యం రోగితో ఫోన్‌లో ఆరోగ్య స్థితిగతులను వాకబు చేస్తారు. ఈ ప్యాకేజీలో హోం ఐసోలేషన్‌ కిట్‌ ఉంటుంది. ప్రాథమిక మందులు, పల్స్‌ ఆక్సిమీటర్‌, స్పైరోమీటర్‌, నేలను శుభ్రం చేసే రసాయనం, యాంటీ బ్యాక్టీరియల్‌ మందు, ఒక బాక్స్‌ గ్లౌజులు, డిజిటల్‌ థర్మామీటర్‌, రెండు ప్యాకెట్ల పేపర్‌ గ్లౌజులు, అరలీటర్‌ శానిటైజర్‌, 60 మూడు లేయర్ల మాస్క్‌లు, పది చెత్తను పారబోసే బ్యాగ్‌లు అందిస్తారు.

ఎవరికి ఆసుపత్రిలో బెడ్‌ అవసరమంటే..

  • కరోనా సోకితే ఆందోళన చెందనవసరం లేదు. స్వల్ప, మధ్య లక్షణాలుంటే కుటుంబ వైద్యుడి సూచనలు పొందుతూ ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చు. ప్రస్తుతం సుమారు 95 శాతం మంది అలాగే కోలుకుంటున్నారు.
  • వయసు పైబడడంతో పాటు అధిక రక్తపోటు, మధుమేహ బాధితులు, గుండె, మూత్రపిండాలు, కాలేయం, కేన్సర్‌ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆసుపత్రుల్లో చేరాల్సి ఉంటుంది.
  • 3-5 రోజులపాటు తీవ్ర ఆయాసం, జ్వరం, దగ్గుతో పాటు ఆక్సిజన్‌ 94-92 శాతం కంటే తగ్గితే ఆసుపత్రిలో చేరాలి. స్థూలకాయ బాధితులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి.
  • కరోనా రోగుల్లో రక్తంలోని డిడైమర్స్‌, ఐఎల్‌6, పెరిటిన్‌, ఎల్‌డీహెచ్‌, హెచ్‌ఆర్‌సీఆర్‌పీలు అసాధారణ స్థాయిలో ఉంటే ఆసుపత్రిలో చేరాలి.
  • భయాందోళనలు వీడాలి. కరోనా ఉంటే ఎలాంటి శారీరక శ్రమ చేయకూడదు. రోజులో సాధ్యమైనంత ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి. అలా చేస్తే వేగంగా కోలుకునే వీలుంటుంది.

-డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజు, ప్రముఖ వైద్యులు, నిమ్స్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.