ETV Bharat / city

KTR Review on HMDA: హైదరాబాద్​ అభివృద్ధిలో కీలక పాత్ర.. హెచ్​ఎండీఏపై కేటీఆర్​ ప్రశంసలు - హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​మెంట్ అథారిటీ

KTR Review on HMDA: హైదరాబాద్​ అమీర్​పేట్​లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్​ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇంజినీరింగ్​, ప్లానింగ్​, అర్బన్​ ఫారెస్ట్రీ వంటి విభాగాల వారీగా మంత్రి కేటీఆర్​ సమీక్షించారు. భవిష్యత్ ప్రణాళికలు, నిధుల సేకరణ, ఇతర అంశాలపై కూలంకుషంగా చర్చించారు.

HMDA Playing Key role in the development of Hyderabad said KTR in review

author img

By

Published : Feb 11, 2022, 7:15 PM IST

KTR Review on HMDA: రాజధాని అభివృద్ధిలో ఏడు జిల్లాల పరిధికి విస్తరించి ఉన్న హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​మెంట్ అథారిటీ(HMDA) ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అభినందించారు. ఇకపై దూరదృష్టితో కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకుసాగాలని హెచ్​ఎండీఏ ఉన్నతాధికారులకు సూచించారు. అమీర్​పేట్​లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మెట్రోపాలిటన్​ కమిషనర్​, స్పెషల్​ చీఫ్​ సెక్రెటరీ అర్వింద్​ కుమార్​.. హెచ్​ఎండీఏ కార్యాచరణను మంత్రికి వివరించారు. ఇంజినీరింగ్​, ప్లానింగ్​, అర్బన్​ ఫారెస్ట్రీ వంటి విభాగాల వారీగా మంత్రి కేటీఆర్​ సమీక్షించారు. అధికారులను పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు మంత్రి కొన్ని సూచనలు చేశారు. సమీక్ష సమావేశానికి హైదరాబాద్ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్​ ఎండీ సంతోష్, అర్బన్​ ఫారెస్ట్రీ డైరెక్టర్​ ప్రభాకర్, హెచ్​ఎండీఏ సెక్రెటరీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.