కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అనంతరం కర్ణాటక హైకోర్టు తీర్పుతో ఈ వివాదానికి తెరపడిందని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే ఈ వివాదం మరోమారు ఉత్పన్నమయ్యేలా కనిపిస్తోంది. కారణం.. ప్రస్తుతం కర్ణాటకలోని యూనివర్సిటీల్లో ప్రీ-ఎగ్జామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి. ఫలితంగా హిజాబ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చేలా కనిపిస్తుంది.
హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తీవ్ర మనస్తాపానికి గురైన పలువురు విద్యార్థులు.. హిజాబ్ ధరించకుండా పరీక్షకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. వీరిలో కుందాపూర్‌కు చెందిన 24 మంది, బైందూరుకు చెందిన 14 మంది, ఉడిపి ప్రభుత్వ బాలికల కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు ఉన్నారు.
వీరంతా తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ విద్యార్థినులు గతంలోనూ ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరించారు. ఇప్పుడు ప్రీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్‌ను రాయకూడని నిర్ణయించుకున్న నేపథ్యంలో హిజాబ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చేలా కనిపిస్తోంది.
ఇదీ చూడండి: సుప్రీంకోర్టు ముంగిట 'హిజాబ్ వివాదం'.. హోలీ తర్వాతే!