మద్య వ్యసన విముక్తి (డీఅడిక్షన్) కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో ఆరేళ్లయినా ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని, లేనిపక్షంలో ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులు.. ప్రజారోగ్యశాఖ, వైద్యవిద్య డైరెక్టర్లు ఈ నెల 25న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
మద్య వ్యసన విముక్తి కేంద్రాల ఏర్పాటుకు 2013లో జీవో ఇచ్చినా అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ 2016లో వ్యక్తిగత (పార్టీ ఇన్ పర్సన్) హోదాలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టి.. ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి..
SI Preliminary Exam: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోన్న ఎస్సై ప్రాథమిక పరీక్ష
ప్రియుడి ఇంట్లో వివాహిత అలా.. మహిళను తాళ్లతో కట్టేసి దేహశుద్ధి!