హైకోర్టులో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ పర్మిట్లపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణపై పీఎల్ విశ్వేశ్వరావు వేసిన పిల్‌ను సోమవారానికి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
పర్మిట్లపై మధ్యంతర ఉత్తర్వులు సోమవారం వరకు పొడిగించింది. మంత్రిమండలి నిర్ణయాన్ని ఏజీ సీల్డ్‌కవర్‌లో సమర్పించారు. ఈ నిర్ణయాన్ని రహస్యంగా ఉంచాల్చిన అవసరమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జీవో వచ్చిన తర్వాతే కేబినెట్ నిర్ణయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్న ఏజీ తెలిపారు.
ఆర్టీసీ ప్రైవేటీకరణ కాకుండా రూట్ల పర్మిట్ ప్రస్తావన చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. రూట్ల ప్రైవేటీకరణ వ్యవహారంలో కేంద్రాన్ని ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.