ETV Bharat / city

క్రమబద్ధీకరించకుండా ఒప్పందం పొడిగించడమేమిటి.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న - గ్రేడ్​ 4 పంచాయతీ కార్యదర్శులు

High Court Orders Telangana Government 2018లో నియమితులైన పంచాయతీ కార్యదర్శులను క్రమబద్దీకరించకుండా ఒప్పందం పొడిగించడంపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై మండిపడింది. ఒప్పందం గడువును 3 నుంచి 4 ఏళ్లకు పొడిగిస్తూ గత ఏడాది జులైలో జారీ చేసిన జీవో 26ను సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రహించగా వాదనలు విన్న హైకోర్టు దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

High Court
High Court
author img

By

Published : Sep 7, 2022, 9:54 AM IST

High Court Orders Telangana Government: రాష్ట్రవ్యాప్తంగా నియమితులైన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్‌-4 స్థాయిలో క్రమబద్ధీకరించకుండా ఒప్పంద గడువును మరో ఏడాది పాటు పొడిగించడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామక ఒప్పందం గడువును 3 నుంచి 4 ఏళ్లకు పొడిగిస్తూ గత ఏడాది జులైలో జారీ చేసిన జీవో 26ను సవాలు చేస్తూ తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్‌ ఫెడరేషన్‌ తరఫున ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీకాంత్‌, మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై మంగళవారం జస్టిస్‌ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 9355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం 2018 ఆగస్టులో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు.దీని ప్రకారం అభ్యర్థులు రాత పరీక్షకు హాజరై నియమితులయ్యారన్నారు. నియామకం సమయంలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ పలు షరతులతో ఒప్పందం చేయించుకున్నారన్నారు. సంతృప్తికరంగా మూడేళ్ల సర్వీసు పూర్తయ్యాక గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరణ ఉంటుందని పేర్కొన్నారని తెలిపారు.

ఈ నిబంధనకు విరుద్ధంగా ఒప్పందం గడువును 3 నుంచి 4 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. మూడేళ్లు పూర్తయిన తేదీ నుంచి గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.