ETV Bharat / city

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు - ap election commission news

ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్​పై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులను వివరించేందుకు ప్రభుత్వం ఇద్దరు, ముగ్గురు అధికారులను ఎస్​ఈసీ కమిషనర్​ వద్దకు పంపాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఎస్​ఈసీకి వివరించి వాటికి సంబంధించిన పత్రాలను చూపాలని తెలిపింది.

ap high court
ap high court
author img

By

Published : Dec 23, 2020, 3:35 PM IST

Updated : Dec 23, 2020, 10:40 PM IST

ఫిబ్రవరిలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రొసీడింగ్స్​ను నిలుపుదల చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర హైకోర్టును పంచాయతీ కార్యదర్శి ఆశ్రయించారు. ఆ పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం ఏపీ పరిస్థితులను ఎన్నికల కమిషనర్​కు వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇద్దరు లేదా ముగ్గురు అధికారులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎస్​ఈసీకి వివరించాలని.. సంబంధిత పత్రాలను ఎస్ఈసీకి అందజేయాలని ఆదేశించింది.

ఆ ఉద్దేశంతోనే

సమావేశం ఎప్పుడు? ఎక్కడ నిర్వహించాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని హైకోర్టు తెలిపింది. అనంతరం ఎన్నికల నిర్వహణపై ఎస్​ఈసీ తన నిర్ణయం చెబుతుందని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించిన ఉత్తర్వులను ఈనెల 29న లిఖిత పూర్వక ఆదేశాలిస్తామంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్​ను సాకుగా చూపిస్తోందని పిటిషనర్​ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్​పై ఇప్పటివరకు ఎటువంటి షెడ్యూల్ ప్రకటించలేదని గత విచారణలో కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. షెడ్యూల్ వస్తే కట్టుబడి ఉంటారా? అని న్యాయమూర్తి ప్రశ్నిస్తే ..కట్టుబడి ఉంటామని ఎస్​ఈసీ న్యాయవాది తెలిపారు.

ఎస్​ఈసీకి వివరించండి

కరోనా వ్యాక్సినేషన్ కారణంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని.. ప్రభుత్వ ఉద్యోగస్థులు వ్యాక్సినేషన్ నిర్వహణలో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే పోలీసుల్లో 11 వేల మందికి పైగా కరోనా సోకిందని గత వాదనల్లో ప్రభుత్వం తరఫు ఏజీ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ముగ్గురు అధికారులు ఎస్ఈసీని సంప్రదించి ప్రస్తుత పరిస్థితిని, ఎందుకు ఎన్నికలు వద్దంటున్నారో వివరించాలని ధర్మాసనం ఆదేశించింది.

ఇదీ చదవండి : ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

Last Updated : Dec 23, 2020, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.