ఇంటర్ ఫలితాల వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 27న రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఫలితాలతో పాటు జవాబు పత్రాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని స్పష్టం చేసింది. రీవెరిఫికేషన్ ప్రక్రియ ఇవాళ రాత్రికి పూర్తవుతుందని ఇంటర్ బోర్డు ధర్మాసనానికి తెలిపింది. సవరించిన మార్కుల మెమోలు రేపు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఫలితాలు ప్రాసెస్ చేసిన గ్లోబరీనా సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 6కు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: మూడో పంపు వెట్రన్ విజయవంతం