ETV Bharat / city

'రైతులకు పరిహారం చెల్లింపుల అంశంలో కౌంటర్​ వేయండి' - ts high court updates

గతేడాది భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకున్నారా లేదా తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై నాలుగు వారాల్లో పూర్తి కౌంటర్​ దాఖలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్​ను ఆదేశించింది.

high court on farmers whose crops were damaged by heavy rains last year.
'రైతులకు పరిహారం చెల్లించారా..? లేదా ..?'
author img

By

Published : Feb 4, 2021, 8:47 PM IST

రాష్ట్రంలో గతేడాది భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకున్నారా లేదా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

విచారణ చేపట్టింది..

గత సెప్టెంబరు, అక్టోబరులో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ, పరిహారం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌంటరు దాఖలుకు గడువు ఇవ్వాలని వ్యవసాయ శాఖ కమిషనర్ తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. అంగీకరించిన ధర్మాసనం నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ను ఆదేశించింది.

ఇదీ చదవండి: 'ఈశాన్యం'లో క్యాన్సర్​ గుబులు- పెరగనున్నకేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.