ETV Bharat / city

'రూట్ల ప్రైవేటీకరణ చట్ట విరుద్ధమని ఎలా చెప్పగలం..?'

ప్రభుత్వం చట్ట విరుద్ధంగా రూట్ల ప్రైవేటీకరణ చేస్తోందని ప్రస్తుత దశలో ఎలా చెప్పగలమని హైకోర్టు ప్రశ్నించింది. రూట్ల ప్రైవేటీకరణ కోసం చట్టపరమైన ప్రక్రియ ప్రారంభించాలని మాత్రమే రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఆర్టీసీతో పాటు.. ప్రైవేట్ ఆపరేటర్లను అనుమతించేందుకు.. కేంద్ర మోటారు వాహనాల చట్టం చెబుతోందని... అలాంటప్పుడు కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుందని ప్రశ్నించింది. రవాణా రంగంలో ప్రైవేటీకరణ ఉండొద్దన్న నిషేధం ఉందా అని ప్రశ్నించింది. ప్రపంచీకరణ, క్యాపిటలైజేషన్ కాలంలో ప్రపంచం ఉందని.. పౌర విమానయాన రంగంలో ప్రైవేట్ సంస్థల అనుమతి సత్ఫలితాలిచ్చిందని వ్యాఖ్యానించింది.

tsrtc routes privatization
author img

By

Published : Nov 19, 2019, 10:06 PM IST

'రూట్ల ప్రైవేటీకరణ చట్ట విరుద్ధమని ఎలా చెప్పగలం..?'

రూట్ల ప్రైవేటీకరణ కోసం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం చట్టపరంగా తప్పెలా అవుతుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

అలా చట్టంలో ఎక్కడైన ఉందా..?

కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ వద్ద మధ్యవర్తిత్వం ప్రక్రియ పూర్తి కాకముందే... రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. రాజీ ప్రక్రియ విఫలమైందని.. మధ్యవర్తిత్వం చేసిన అధికారి అప్పటికే ప్రకటించారని హైకోర్టు పేర్కొంది. మధ్యవర్తిత్వానికి కార్మిక సంఘాలను పిలిచిన అధికారి... ఎలాంటి కారణాలు పేర్కొనకుండా వాయిదా వేశారని ప్రభాకర్ తెలిపారు. వాయిదా వేసేందుకు కారణాలు చూపాలని పారిశ్రామిక వివాదాల చట్టంలో ఎక్కడైనా ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు

అవి రెండు వేర్వేరు అంశాలు

రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి.. 5,100 రూట్లను ప్రైవేటీకరిస్తోందని పిటిషనర్ వాదించారు. ఏ చట్టంలోని ఏ అధికారాన్ని దుర్వినియోగం చేసిందో వివరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. సమ్మె కొనసాగుతుండగానే... బస్సులను ప్రైవేటీకరణ చేస్తోందని వాదించారు. రూట్ల ప్రైవేటీకరణ... బస్సుల ప్రైవేటీకరణ వేర్వేరన్న హైకోర్టు.. కొన్ని రూట్లలో ఇతర రాష్ట్రాల ఆర్టీసీలకు, ప్రైవేట్ ఆపరేటర్లకు కూడా అనుమతి ఇస్తారు కదా అని పేర్కొంది. మంత్రిమండలి నిర్ణయం రూట్ల ప్రైవేటీకరణ కోసమని.. బస్సుల ప్రైవేటీకరణ కోసం కాదని హైకోర్టు పేర్కొంది.

ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలి

రోడ్డు రవాణా రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుందని.. కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని 67వ సెక్షన్ చెబుతోందని ధర్మాసనం తెలిపింది. రవాణాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆపరేటర్లను అవకాశం ఇచ్చేందుకు ఎంవీ చట్టం వీలు కల్పిస్తోందని... అలాంటప్పుడు కేబినెట్ నిర్ణయం చట్టపరంగా తప్పెలా అవుతుందని ప్రశ్నించింది. ఎంవీ చట్టంలోని 102 సెక్షన్ ప్రకారం రవాణా వ్యవస్థలో ఏ మార్పులు చేసినా... అప్పటికే ఆ రంగంలో ఉన్న వారికి సమాచారం ఇవ్వాలని చిక్కుడు ప్రభాకర్ తెలిపారు. దానిప్రకారం ఆర్టీసీకి సమాచారం ఇచ్చి వారి వాదనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'

వారి వాదనలు వినాలి

చట్టం ప్రకారం ఆర్టీసీకి సమాచారం.. కేబినెట్ నిర్ణయం తీసుకోక ముందే ఇవ్వాలా... తర్వాత ఇవ్వాలా అని ధర్మసనం అడిగింది. ప్రస్తుత రవాణా వ్యవస్థలో ప్రతిపాదిత మార్పులను గెజిట్​లో ప్రచురించాలని... స్థానిక పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి 30 రోజుల్లో అభ్యంతరాలను స్వీకరించాలని... ఆర్టీసీతో పాటు ఇతర ముఖ్యమైన సంస్థలను పిలిచి వాదనలు వినాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ప్రక్రియ ప్రారంభించాలని మాత్రమే కేబినెట్ నిర్ణయం తీసుకుందని హైకోర్టు వెల్లడించింది. ప్రక్రియ ప్రారంభం కాకముందే.. ప్రస్తుత దశలో రూట్ల ప్రైవేటీకరణ చట్ట విరుద్ధమని ఎలా చెప్పగలమని న్యాయవాదిని ప్రశ్నించింది.

సీఎం నిర్ణయం కోర్టుకు అవసరం లేదు

ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరగనీయమని గతంలో సీఎం చెప్పారని న్యాయవాది ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఏం అన్నారనేది కోర్టుకు అవసరం లేదని.. కేబినెట్ నిర్ణయం చట్టబద్ధమా.. చట్ట విరుద్ధమా అనేదే తమ ముందున్న అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల వేల మంది ఆర్టీసీ కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. రూట్ల ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకునే ముందు... ఆర్టీసీ కార్మికుల విషయం ఆలోచించాలని ఎంవీ చట్టంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించింది. చట్టాలకు హైకోర్టు అతీతం కాదని... చట్టాల పరిధి దాటి నిర్ణయాలు తీసుకోలేమని ధర్మాసనం మరోసారి పేర్కొంది. ఒకవేళ సమ్మె సమయంలో కాకుండా మరో సందర్భంలో ప్రజల అవసరాల కోసం రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు రూట్ల ప్రైవేటీకరణ చేస్తే అప్పుడు చట్టవిరుద్ధమని చెప్పగలరా అని ప్రశ్నించింది.

ఇదీ చూడండి: 'ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర పన్నుతున్నారు'

ప్రపంచం గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ దశలో ఉంది

రవాణా రంగంలో ప్రైవేటీకరణ ఉండకూడదని ఏ చట్టంలోనైనా ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. కాలం మారిపోతోందని.. ప్రపంచం గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ దశలో ఉందని వ్యాఖ్యానించింది. గతంలో పౌరవిమానయాన రంగంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రమే ఉండేందని.. ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతినిచ్చాక... కింగ్ ఫిషర్ వంటి కొన్ని సంస్థలు మినహా మిగతావి రాణించాయని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి వాదనలు బుధవారం వింటామన్న హైకోర్టు.. తదుపరి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది.

ఇదీ చూడండి: సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి

TG_HYD_47_19_HC_ON_ROUTS_PRIVATIZATION_PKG_3064645 REPORTER: NAGESHWARA CHARY ( ) ప్రభుత్వం చట్ట విరుద్ధంగా రూట్ల ప్రైవేటీకరణ చేస్తోందని ప్రస్తుత దశలో ఎలా చెప్పగలమని హైకోర్టు ప్రశ్నించింది. రూట్ల ప్రైవేటీకరణ కోసం చట్టపరమైన ప్రక్రియ ప్రారంభించాలని మాత్రమే రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఆర్టీసీతో పాటు.. ప్రైవేట్ ఆపరేటర్లను అనుమతించేందుకు.. కేంద్ర మోటారు వాహనాల చట్టం చెబుతోందని... అలాంటప్పడుు కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుందని ఉన్నప్పుడు అడిగింది. రవాణ రంగంలో ప్రైవేటీకరణ ఉండొద్దన్న నిషేధం ఉందా అని ప్రశ్నించింది. ప్రపంచీకరణ, క్యాపిటలైజేషన్ కాలంలో ప్రపంచం ఉందని.. పౌర విమానయాన రంగంలో ప్రైవేట్ సంస్థల అనుమతి సత్ఫలితాలిచ్చిందని వ్యాఖ్యానించింది. LOOK వాయిస్ ఓవర్: రూట్ల ప్రైవేటీకరణ కోసం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న చట్టపరంగా తప్పెలా అవుతుందో చెప్పాలని హైకోర్టు అడిగింది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ వద్ద మధ్యవర్తిత్వం ప్రక్రియ పూర్తి కాకముందే... ప్రభుత్వం రూట్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. రాజీ ప్రక్రియ విఫలమైందని.. మధ్యవర్తిత్వం చేసిన అధికారి అప్పటికే ప్రకటించారని హైకోర్టు పేర్కొంది. అయితే మధ్యవర్తిత్వానికి కార్మిక సంఘాలను పిలిచిన అధికారి... ఎలాంటి కారణాలు పేర్కొనకుడా వాయిదా వేశారని ప్రభాకర్ పేర్కొన్నారు. వాయిదా వేసేందుకు కారణాలు చూపాలని పారిశ్రామిక వివాదాల చట్టంలో ఎక్కడైనా ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. బైట్: చిక్కుడు ప్రభాకర్, న్యాయవాది బైట్: పీఎల్ విశ్వేశ్వరరావు, పిటిషనర్ వాయిస్ ఓవర్: రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికిక పాల్పడి.. 5100 రూట్లను ప్రైవేటీకరణ చేస్తోందని పిటిషనర్ వాదించారు. ఏ చట్టంలోని ఏ అధికారాన్ని దుర్వినియోగం చేసిందో వివరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. సమ్మె కొనసాగుతుండగానే... బస్సలను ప్రైవేటీకరణ చేస్తోందని వాదించారు. రూట్ల ప్రైవేటీకరణ... బస్సుల ప్రైవేటీకరణ వేర్వేరన్న హైకోర్టు.. కొన్ని రూట్లలో ఇతర రాష్ట్రాల ఆర్టీసీలకు, ప్రైవేట్ ఆపరేటర్లకు కూడా అనుమతి ఇస్తారు కదా అని పేర్కొంది. మంత్రి మండలి నిర్ణయం రూట్ల ప్రైవేటీకరణ కోసమని.. బస్సుల ప్రైవేటీకరణ కోసం కాదని హైకోర్టు పేర్కొంది. రోడ్డు రవాణ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుందని..కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని 67వ సెక్షన్ చెబుతోందని ధర్మాసనం తెలిపింది. రవాణలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆపరేటర్లను అవకాశం ఇచ్చేందుకు ఎంవీ చట్టం వీలు కల్పిస్తోందని... అలాంటప్పుడు కేబినెట్ నిర్ణయం చట్టపరంగా తప్పెలా అవుతుందని ప్రశ్నించింది. ఎంవీ చట్టంలోని 102 సెక్షన్ ప్రకారం రవాణ వ్యవస్థలో ఏ మార్పులు చేసినా... అప్పటికే ఆ రంగంలో ఉన్న వారికి సమాచారం ఇవ్వాలని చిక్కుడు ప్రభాకర్ తెలిపారు. దానిప్రకారం ఆర్టీసీకి సమాచారం ఇచ్చి వారి వాదనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అయితే చట్టం ప్రకారం ఆర్టీసీకి సమాచారం.. కేబినెట్ నిర్ణయం తీసుకోక ముందే ఇవ్వాలా... తర్వాత ఇవ్వాలా అని అడిగింది. ప్రస్తుత రవాణ వ్యవస్థలో ప్రతిపాదిత మార్పులను గెజిట్ లో ప్రచురించాలని... స్థానిక పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి 30 రోజుల్లో అభ్యంతరాలను స్వీకరించాలని... ఆర్టీసీతో పాటు.. ఇతర ముఖ్యమైన సంస్థలను పిలిచి వాదనలు వినాలని ఎంవీ చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం హైకోర్టు పేర్కొంది. అయితే మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ప్రక్రియ ప్రారంభించాలని మాత్రమే కేబినెట్ నిర్ణయం తీసుకుందని హైకోర్టు వెల్లడించింది. కాబట్టి ప్రక్రియ ప్రారంభం కాకముందే.. ప్రస్తుత దశలో రూట్ల ప్రైవేటీకరణ చట్ట విరుద్ధమని ఎలా చెప్పగలమని ప్రశ్నించింది. బైట్: చిక్కుడు ప్రభాకర్, న్యాయవాది బైట్: పీఎల్ విశ్వేశ్వరరావు, పిటిషనర్ వాయిస్ ఓవర్: ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరగనీయమని గతంలో సీఎం చెప్పారని న్యాయవాది ప్రస్తావించారు. అయితే ముఖ్యమంత్రి ఏం అన్నారనేది కోర్టుకు అవసరం లేదని.. కేబినెట్ నిర్ణయం చట్టబద్ధమా.. చట్ట విరుద్ధమా అనేదే తమ ముందున్న అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల వేల మంది ఆర్టీసీ కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. రూట్ల ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకునే ముందు... ఆర్టీసీ కార్మికుల విషయం ఆలోచించాలని ఎంవీ చట్టంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించింది. హైకోర్టు చట్టాలకు అతీతం కాదని... చట్టాల పరిధి దాటి నిర్ణయాలు తీసుకోలేమని మరోసారి ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ సమ్మె సమయంలో కాకుండా... మరో సందర్భంలో.. రాష్ట్రంలో ప్రజల అవసరాల కోసం.. రవాణ వ్యవస్థ మెరుగుపరిచేందుకు రూట్ల ప్రైవేటీకరణ చేస్తే.. అప్పుడు చట్టవిరుద్ధమని చెప్పగలరా అని ప్రశ్నించింది. రవాణ రంగంలో ప్రైవేటీకరణ ఉండకూడదని ఏ చట్టంలోనైనా ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. కాలం మారిపోతోందని.. ప్రపంచం గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ దశలో ఉందని వ్యాఖ్యానించింది. గతంలో పౌరవిమానయాన రంగంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రమే ఉండేందని.. ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతినిచ్చాక... కింగ్ ఫిషర్ వంటి కొన్ని సంస్థలు మినహా మిగతావి రాణించాయని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి వాదనలు రేపు వింటామన్న హైకోర్టు.. తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఆదేశాలు రేపటి వరకు పొడిగించింది. END
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.