జూబ్లీహిల్స్ కార్పొరేటర్‌గా గెలిచిన భాజపా నాయకుడు వెంకటేష్‌కు నలుగురు పిల్లలు ఉన్నారన్న వ్యాజ్యాన్ని మూడు నెలల్లో తేల్చాలని సిటీ సివిల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదన్న నిబంధనను ఉల్లంఘించినందున వెంకటేష్ ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల ట్రైబ్యునల్ హోదా ఉన్న సిటీ సివిల్ కోర్టులో... తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన కాజా సూర్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. సివిల్ కోర్టులో తేలే వరకు వెంకటేష్ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సిటీ సివిల్ కోర్టులో వ్యాజ్యం పెండింగ్‌లో ఉన్నందున.. అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని హైకోర్టు పేర్కొంది. వెంకటేష్‌పై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని.. ఆరోపణలు నిజమని తేలితే ఎన్నికల్లో పోటీకి అనర్హత ఉన్న వ్యక్తి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నందున పిటిషన్‌ను త్వరగా తేల్చాలని సిటీ సివిల్ కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు విచారణ ముగించింది. వెంకటేష్ ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించినందున.. ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని ఫిర్యాదు చేయనున్నట్లు సూర్యనారాయణ తెలిపారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు