తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం హిమకోహ్లి ప్రత్యేక పూజలు చేశారు.
మొదట పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆమె సేవాసదన్, అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. సౌకర్యాల పట్ల భక్తులతో మాట్లాడారు.
- ఇదీ చూడండి : చార్‌ధామ్‌ను దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు