Heavy traffic jam: హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తూప్రాన్‌పేట నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతినటంతో.. ఎన్‌హెచ్ సిబ్బంది మరమ్మతు పనులకు ఉపక్రమించారు. ఈరోజు పండుగ రోజు కావటం వల్ల సాధారణంగానే ఎక్కువ రద్దీ ఉంటుంది. అసలే హైవే.. అందులోనూ మరమ్మతు పనులు జరుగుతుండటం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. చేసేదేమీలేక వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి.
ఇవీ చూడండి: