రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట వద్ద జాతీయ రహదారిపై వాహనాల (heavy traffic jam at peddamaberpet ) రాకపోకలు స్తంభించాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ డీసీఎం ఓవర్ స్పీడ్తో వచ్చి.. రోడ్డు పక్కనున్న అంబేడ్కర్ విగ్రహాన్ని ఢీకొట్టింది. దీంతో విగ్రహం పూర్తిగా ధ్వంసమైంది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీఎం యజమాని అదే స్థానంలో తన ఖర్చుతో విగ్రహం ఏర్పాటు చేయిస్తానని చెప్పడంతో.. వివాదం సద్దుమణిగింది.
మరోవైపు ప్రమాద సమయంలో డీసీఎంలో ఉన్న కూరగాయలు సైతం రోడ్లుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. అన్ని రకాల కూరగాయలు ఉండడంతో వాటిని తీసుకొనేందుకు వాహనదారులు, జనం ఎగబడ్డారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా (heavy traffic jam at hyderabad Vijayawada highway ) రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీచూడండి: Bandi Sanjay Nalgonda Tour: బండి సంజయ్ పర్యటనకు అనుమతి తీసుకోలేదు: నల్గొండ ఎస్పీ