రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని... తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తున్న అల్పపీడనం.. కొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు. ఒడిశా- బంగాల్ తీరం వద్ద వాయుగుండంగా మారే అవకాశమందని తెలిపారు.
ఇదీ చూడండి:
Sai Dharam tej Bike: సాయిధరమ్ తేజ్ బైక్ అంత ప్రత్యేకమైందా..? ధరెంతో తెలుసా?