ETV Bharat / city

ఈదురుగాలుల బీభత్సం.. ఉరుములు మెరుపులతో వర్షం - ఏపీ తాజా వార్తలు

Heavy Rains in AP: ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఫలితంగా పలుచోట్ల విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగి రహదారులపై పడటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

Heavy Rains in AP
Heavy Rains in AP
author img

By

Published : May 31, 2022, 9:22 AM IST

Heavy Rains in AP: ఏపీలో సోమవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. బాపట్ల, అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బాపట్ల జిల్లాలోని కడవకుదురు-పందిళ్లపల్లి మధ్య జాతీయ రహదారి వెంట ఉన్న 25 జామాయిల్ భారీ వృక్షాలు కూలి.. రహదారికి అడ్డంగా పడిపోయాయి. చినగంజాం ఉప్పుకొఠార్లలో ఉన్న విద్యుత్ పరివర్తకంతోపాటు... 10 విద్యుత్ స్తంభాలు పెనుగాలికి కూలిపోయాయి. చీరాల, వేటపాలెం, చినగంజాం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

అనంతరపురం జిల్లా విడపనకల్‌ మండలం పాల్తూరులో కురిసిన గాలివానకు.. గ్రామంలోని చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్​ఫార్మర్లు నేలకొరిగాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాలపై చెట్లు విరిగి పడటంతో వాహనాలు దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లా భీమినేనివారి పాలెంలో ఈదురు గాలులకు ప్రధాన రహదారిపై చెట్టు నేలకొరిగింది. కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. జేసీబీ సాయంతో చెట్టుని తొలగించడంతో రాకపోకలు కొనసాగించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజపాలెం గ్రామంలో ఈదురుగాలుల బీభత్సానికి జాతీయ రహదారిపై చెట్లు నేలకొరిగాయి. కేశినేనిపల్లిలో ఓ ఇంటి పైరేకులు ఎగిరిపోయాయి.

ఇవీ చదవండి : Weather Report Of Telangana: రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.