ETV Bharat / city

HEAVY RAINS IN NELLORE: ఇంకా ముంపులోనే ప్రజలు.. మరోవైపు వణికిస్తున్న వరుణుడు

ఏపీలోని నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం(rain in nellore) కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు(people problems with rains). ఇప్పటికే వరదతో అల్లాడుతున్న ప్రజలకు మరోసారి వర్షం దడ పుట్టిస్తోంది.

HEAVY RAINS IN NELLORE
నెల్లూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షం
author img

By

Published : Nov 28, 2021, 5:31 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం(heavy rains in nellore) కురిస్తోంది. రహదారులపై వాన నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరులో రాత్రి నుంచి కురుస్తున్న(Rain falling in atmakur) వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు... జేసీబీ సహాయంతో చెరువులకు గండి కొట్టి వరద నీటిని‌ దిగువ ప్రాంతాలకు తరలించారు.

నెల్లూరులో పర్యటిస్తున్న కేంద్ర బృందం

వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్రబృందం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తోంది. కేంద్ర బృందం(central team in nellore) పరిశీలిస్తున్న సమయంలోనే వర్షం ముంచెత్తింది. దీంతో వారి పర్యటనకు అంతరాయం ఏర్పడింది.

కాలనీవాసుల ఆందోళన

జిల్లాలోని అనంతసాగరంలోని ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరికతో అనంతసాగరం బస్టాండ్ వద్ద కాలనీవాసులు(people protest in rain) ఆందోళన చేపట్టారు. వర్షంలోనే నిరసనకు దిగారు. అధికారులు సహాయ చర్యలు చేపట్టాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

వరద ముంపు మరవకముందే...

గతవారం వరద సృష్టించిన బీభత్సం(flood in nellore) మరవకముందే మరోసారి వర్షం ప్రజల్లో వణుకు మొదలైంది. వరద ముంపు నుంచి తెరుకోకముందే భారీ వర్షం రావడం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరో ముప్పు ముంచుకోస్తోంది. అండమాన్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. దీంతో ప్రజలకు మరోసారి వరద ముప్పు తప్పేలా కనిపించడం లేదు. ఏపీలోని రాయలసీమ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.