ETV Bharat / city

ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటన - హైదరాబాద్ వర్షాలు

hyd rains
hyd rains
author img

By

Published : Oct 21, 2020, 7:20 AM IST

Updated : Oct 21, 2020, 1:32 PM IST

13:31 October 21

  • సికింద్రాబాద్ లాలాపేటలోని ప్రమాదకరంగా మారిన పాత బురుజు
  • బురుజు పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉండటంతో స్థానికుల్లో భయాందోళన
  • లాలాపేట ప్రభుత్వ పాఠశాల వెనకవైపు ఇప్పటికే కూలిన గడి గోడ
  • ప్రమాదకరంగా మారిన బురుజు, గడి వల్ల భయాందోళనలో స్థానికులు

13:31 October 21

  • బోడుప్పల్ కార్పొరేషన్​లో వర్షం వల్ల ముంపునకు గురైన కుటుంబాలకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.
  • హైదరాబాద్ కర్మన్​ఘాట్​లోని ఉదయ్​నగర్ కాలనీలో ఇంకా వరద నీరు రాడవంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

13:26 October 21

  • గోషామహల్ డివిజన్ కొత్తబస్తీ ఆర్యసమాజ్ వద్ద కుప్పకూలిన ఇల్లు
  • పాత ఇల్లు కావడంతో భారీ వర్షాలు పడడం వల్ల కుప్పకూలినట్లు తెలిపిన అధికారులు
  • రంగారెడ్డి జిల్లా పహడి షరీఫ్, జల్పల్లి, షాహీన్ నగర్, బాలపూర్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం

11:38 October 21

  • హైదరాబాద్​ లాలాపేటలో ఉపసభాపతి పద్మారావుగౌడ్‌తో కలిసి పర్యటిస్తున్న కేటీఆర్‌
  • వరద బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్‌, సభాపతి పద్మారావుగౌడ్‌
  • వరద బాధితులకు ప్రభుత్వ సహాయాన్ని పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్‌

10:41 October 21

  • హైదరాబాద్‌: కామాటిపురాలో కూలిన పాత ఇల్లు
  • అప్రమత్తమై బయటకు పరుగెత్తిన ఇంట్లోని వారు, తప్పిన ప్రాణనష్టం

08:10 October 21

  • వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. @PawanKalyan #HyderabadRains #HyderabadFloods

    pic.twitter.com/IlqVxe4LWY

    — JanaSena Party (@JanaSenaParty) October 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ ప్రభుత్వానికి పవన్‌ కల్యాణ్‌ రూ.కోటి విరాళం ప్రకటించారు. వరదలు, భారీ వర్షాలకు హైదరాబాద్‌ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పవన్ అన్నారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని... వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసైనికులు, నాయకులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. 

07:22 October 21

వీడని వరద కష్టాలు

హైదరాబాద్​ను వరద కష్టాలు వీడటంలేదు. ఇప్పటికే అనేక కాలనీలు ముంపుగుప్పిట్లోనే ఉండగా... మళ్లీ మళ్లీ కురుస్తున్న వానలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. భారీవర్షాలతో జీహెచ్​ఎంసీ పరిధిలో దాదాపుగా 100కి పైగా చెరువులు గరిష్ఠ నీటిమట్టానికి చేరాయి. వీటి కింద 800 కాలనీల్లో 5లక్షలమంది జీవనం సాగిస్తున్నారు. వర్షసూచనతో చెరువుకట్టలు తెగి ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రభావిత నివాసాల ప్రజలు అల్లాడిపోతున్నారు.

07:14 October 21

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

మళ్లీ వాన 

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పలు చోట్ల మోస్తరు, కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, అంబర్‌పేట, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది.

మియాపూర్, చందానగర్, కొండాపూర్, పాతబస్తీ, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. 

Last Updated : Oct 21, 2020, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.