రాగల ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి విదర్భ వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.
ఇదీ చూడండి: హైదరాబాద్‌లో వర్షం.. ట్రాఫిక్కు అంతరాయం