రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
నైఋతి బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో 2.1 కిలో మీటర్ల నుంచి 4.5 కిలో మీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. బిహార్ నుంచి తూర్పు విదర్భ వరకు ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా 3.1కిమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి: జిల్లాలో ఒక్క రోజే 1.15 లక్షల మొక్కలు నాటాం: కేటీఆర్