ETV Bharat / city

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద... సాయంత్రం గేట్ల ఎత్తివేత..! - శ్రీశైలం జలాశయం వార్తలు

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా... శ్రీశైలం జలాశయానికి అధికంగా వరద నీరు వస్తోంది. నేటి సాయంత్రానికి ఆనకట్ట గేట్లు ఎత్తి... నాగార్జున సాగర్​కు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

heavy-flooding-of-ap srisailam-reservoir
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద...దిగువకు నీరు విడుదల
author img

By

Published : Aug 19, 2020, 1:04 PM IST

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి 3.75 లక్షల ప్రవాహం వస్తుండడంతో... బుధవారం సాయంత్రం ఆగేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 878.10 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 178.7400 టీఎంసీలుగా నమోదైంది.

మరోవైపు శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి 31,520 క్యూసెక్కులు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి 40,259 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ద్వారా 1,688 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 24,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ఇవీ చదవండి : విధిరాత ఈ ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.