ETV Bharat / city

'వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కరోనా టీకా' - covid vaccine to elder people

వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా ఇచ్చేందుకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 1200 కేంద్రాల్లో వాక్సినేషన్​ ప్రక్రియను కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తోంది.

covid vaccine
'వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కరోనా టీకా'
author img

By

Published : Feb 26, 2021, 10:39 PM IST

Updated : Feb 26, 2021, 10:51 PM IST

రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 1200 కేంద్రాల్లో కరోనా టీకా ఇచ్చేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఇవాళ కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శితో జరిగిన దృశ్యమాధ్యమ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ వివరించారు.

మార్చి 1 నుంచి 65 ఏళ్లు పైబడినవారు, 45 దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్​రెడ్డి సహా పలువురు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

మొత్తం 1000 ప్రభుత్వ, 200 ప్రైవేటు ఆస్పత్రుల్లో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర అధికారులు వివరించారు. మొత్తం 20 రకాల దీర్ఘవ్యాధులతో బాధపడుతున్న వారిని టీకా తీసుకునేందుకు అర్హులుగా ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం గుర్తించిన దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో గుర్తింపు కార్డుతో పాటు, మెడికల్ సర్టిఫికేట్ ఉన్నవారికే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు.

ఇవీచూడండి: 'ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కరోనా టీకా'

Last Updated : Feb 26, 2021, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.