ETV Bharat / city

Ugadi 2022: ఉగాడి పచ్చడి షడ్రుచుల్లో దాగున్న ఆరోగ్యం!

Ugadi 2022: మన సంస్కృతి సంప్రదాయాల్లో ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే పండగలు, ప్రత్యేక సందర్భాల్లో మనం వండుకునే వంటకాలన్నీ ఆరోగ్యాన్ని ప్రసాదించేవే! ఉగాది పచ్చడి కూడా అలాంటిదే! తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు.. వంటి షడ్రుచులు కలగలిసిన ఈ పచ్చడితో శారీరక, మానసిక ఆరోగ్యాల్ని పెంపొందించుకోవచ్చు. మరి, ఈ షడ్రుచుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందామా?!

ugadi pachadi
ugadi pachadi
author img

By

Published : Apr 2, 2022, 5:17 AM IST

Ugadi 2022: ఉగాది పచ్చడిలో వాడే ఆరు రుచుల్లో.. మధుర రసం అంటే చెరకు, అరటిపండు, బెల్లం; ఆమ్ల రసంగా.. చింతపండు; లవణ రసంగా.. ఉప్పు; కటు రుచిగా.. పచ్చిమిర్చి/కారం; తిక్తరుచి (చేదు)గా.. వేప పువ్వు; కషాయం (వగరు) రుచిగా.. మామిడి పిందెలను వాడతాం. వీటిని ఎక్కువ, తక్కువ పరిమాణంలో నిత్యం ఆహారం ద్వారా తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.

వేప పువ్వే ప్రధానం.. : వసంత రుతువు, చైత్రమాసం, పాడ్యమితో మొదలయ్యే తెలుగు సంవత్సరాది రోజున ఆరు రుచుల కలయికతో చేసే ఉగాది పచ్చడి ప్రత్యేకమైంది. ఇందులో వేపపువ్వు పాత్ర కీలకం. ఈ కాలంలో శరీరంలో పెరిగే కఫ దోషాన్ని వేప పువ్వు తగ్గిస్తుంది. మలినాల్ని పోగొట్టి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల కడుపులో పురుగులు నశిస్తాయి.

1. తీపి: మానసిక ఉల్లాసానికి అతి ముఖ్యమైంది తీపి. అలాగని చక్కెరతో తయారయ్యే స్వీట్లు, కేకులు, చాక్లెట్లకు బదులుగా.. బియ్యం, గోధుమ వంటి ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మొదలైనవి తీసుకోవాలి. శరీరానికి అవసరమైన చక్కెర(పిండి పదార్థాలు) వీటి నుంచి అందుతుంది. ఇది శరీరంలోని కణాలు నశించిపోకుండా, కొత్త కణాల పెరుగుదలకు.. వాతం, పిత్తం పెరగనివ్వకుండా అదుపులో ఉంచుతుంది. డైటింగ్‌ పేరుతో వీటిని ఆహారంలో తీసుకోకుండా ఉండడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకే తీపిని పరిమితంగా తీసుకుంటే మంచిదన్న విషయం గుర్తుంచుకోవాలి.

2. పులుపు..: ఈ రుచి ఆహారం జీర్ణం కావడానికి, మలబద్ధకం లేకుండా ఉండడానికి, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుంది. దీన్ని తక్కువగా తీసుకోవాలి. ఈ రుచిని ఆహారంలో చేర్చుకోకపోతే జీర్ణశక్తి దెబ్బతింటుంది. అలాగే ఎక్కువగా తీసుకున్నా కూడా రక్తంపై ప్రతికూల ప్రభావం పడి.. పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది.

3. ఉప్పు..: శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలను ఉప్పు అందిస్తుంది. ఆకలి, జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే దీన్ని కొద్ది పరిమాణంలోనే తీసుకోవాలి. ఖనిజ లవణాలు మనం వాడే ఉప్పు నుంచే కాకుండా కాయగూరలు, పండ్ల నుంచి కూడా అందుతాయి. ఉప్పును ఎక్కువగా వినియోగించే ఊరగాయలు, చిప్స్‌, నిల్వ ఉంచే ఆహార పదార్థాలు, రసాయనాలు చేర్చిన వాటిని ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలకు హాని కలుగుతుంది. చర్మం ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. కీళ్ల వాతం, గ్యాస్ట్రిక్‌.. వంటి సమస్యలు దరిచేరతాయి.

4. కారం..: ఉత్తేజాన్నిచ్చి, శరీరంలో వేడిని పుట్టిస్తుంది కారం. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. దీనివల్ల చెమట ఎక్కువగా పడుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అయితే దీన్ని కూడా కొద్ది పరిమాణంలోనే తీసుకోవాలి. లేదంటే కడుపులో మంట, పిత్త సంబంధిత వ్యాధులు వస్తాయి. శరీరం బలహీనమవుతుంది. కోపం పెరుగుతుంది.

5. చేదు..: దీన్ని కొద్దిగానే తీసుకోవాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, మలినాలను బయటికి పంపుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. వేప, మెంతులు, గోరుచిక్కుడు.. వంటివి చేదు రుచికి ఉదాహరణలు. చేదును ఎక్కువగా తింటే శరీరం ఎండిపోయినట్లుగా మారి, బలహీనమవుతుంది. బాధ, దిగులు ఎక్కువవుతాయి.

6. వగరు..:

వగరు కూడా ఆహారంలో మితంగా ఉండేలా చూసుకోవాలి. రక్తస్రావం ఎక్కువ కాకుండా, అలాగే చెమట అధికంగా పట్టకుండా, శరీరం దృఢంగా ఉండడానికి ఇది అవసరం. గాయాలు మాని, మంట తగ్గడానికి ఈ వగరు రుచి ఉన్న పదార్థాలు తోడ్పడతాయి. అయితే అతిగా తీసుకుంటే వాత వ్యాధులు, పేగుల్లో సమస్యలు వస్తాయి. పలు మానసిక సమస్యలూ ఎక్కువవుతాయి.

ఇదీచూడండి: శుభకృత్‌ నామ సంవత్సర రాశి ఫలాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.